Begin typing your search above and press return to search.

జెట్ స్పీడ్‌ లో లోకేష్

By:  Tupaki Desk   |   12 Sep 2015 8:51 AM GMT
జెట్ స్పీడ్‌ లో లోకేష్
X
తెలుగుదేశం పార్టీ కార్యక‌ర్తల స‌మ‌న్వయక‌ర్తగా ఉన్న లోకేష్ ఆ ప‌దవి చేప‌ట్టిన‌ప్ప‌టినుంచి కార్య‌క‌ర్త‌ల సంక్షేమం కోసం ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో కార్యక్రామ‌నికి శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. పార్టీలో గ‌తంలో నిర్వహించిన కార్యక‌ర్తల శిక్షణా త‌ర‌గతుల‌ను మ‌ళ్లీ తెర‌పైకి తెచ్చారు. అయితే రాష్ర్టం రెండుగా విడిపోయిన నేప‌థ్యంలో పార్టీ ప్రధాన కార్యాల‌యంలో కాకుండా రాష్ట్రంలో నాలుగు చోట్ల నిర్వహించేందుకు షెడ్యూల్ ఖ‌రారు చేశారు. ఈ నేప‌థ్యంలో ముందుగా ప్రకాశం జిల్లా కందుకూరు తిరుపతిలో శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. కందుకూరు శిక్ష‌ణా శిబిరంలో పాల్గొన్న లోకేష్ ఎన‌ర్జిటిక్ స్పీచ్‌ తో ఆక‌ట్టుకున్నారు.

ఏపీ అభివృద్ధిని రెండు దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని నారా లోకేష్ మండిపడ్డారు. ఆ ఇద్ద‌రు కేసీఆర్, జగన్ ల‌ని మండిప‌డ్డారు. సెక్ష‌న్ 8, ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్‌, విద్యుత్ ఉద్యోగుల అంశం త‌దిత‌రాల్లో వీరి దోస్తీ స్ప‌ష్టం అవుతోంద‌న్నారు. అయితే వారు ఇద్దరు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఏపీ అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. రాష్ట్రంలో కరువును చూసి రైతులు భయపడే పరిస్థితి పోయిందన్న లోకేష్...సీఎం హోదాలో చంద్ర‌బాబు అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌ని ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా టీడీపీల చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు.

రాయలసీమ జిల్లాలతో పాటు కర్నాటక, తమిళనాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తిరుపతిలో శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఒక్కో బ్యాచులో వందమంది చొప్పున తిరుపతిలో మొత్తం పన్నెండు వేల మందికి శిక్షణ ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. మొదటి రోజు తిరుప‌తిలో శిక్షణ తరగతులను మంత్రి నారాయణ ప్రారంభించగా, ముఖ్య అతిధిగా పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. తాడేపల్లి గూడెం, అరకుల్లోనూ శిక్షణా శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీలో గ్రామ‌, మండ‌ల స్థాయి క‌మిటీల్లో ఉన్న అధ్యక్ష, కార్యదర్శుల‌ను ఈ శిక్షణ‌ ఆహ్వానిస్తారు. ప్రతి 100 మందికి మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. మొత్తంగా 40 వేల మందికి ట్రైనింగ్ ఇవ్వాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నారు.