Begin typing your search above and press return to search.

అమ్మానాన్నకు లోకేష్ ప్రేమతో..

By:  Tupaki Desk   |   10 Sep 2020 4:00 PM GMT
అమ్మానాన్నకు లోకేష్ ప్రేమతో..
X
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు దంపతుల పెళ్లిరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 1981 సెప్టెంబర్ 10న చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ నేతగా ఉన్న చంద్రబాబుకు, టీడీపీ వ్యవస్థాపకుడు, సీఎం అయిన ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో వివాహం జరిపించారు.

ఎన్టీఆర్ పార్టీ టీడీపీలో చేరిన చంద్రబాబు ఆ తర్వాత టీడీపీలో నంబర్ 2గా ఎదిగారు. ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 40 ఏళ్లుగా రాజకీయంలో ఉంటున్నారు.

తల్లిదండ్రుల పుట్టినరోజు సందర్భంగా వారి కుమారుడు నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి నాటి అరుదైన ఫొటోను షేర్ చేసి ఆనందం పంచుకున్నారు. ఆదర్శ, ఆది దంపతుల్లాగా కలకాలం వర్ధల్లాలని సూచించారు.

ఇక టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.