Begin typing your search above and press return to search.

డీల్ ఓకే : లోకేష్‌తో దేవినేని నెహ్రూ ప్ర‌త్యేక భేటీ

By:  Tupaki Desk   |   11 Aug 2016 12:27 PM GMT
డీల్ ఓకే : లోకేష్‌తో దేవినేని నెహ్రూ ప్ర‌త్యేక భేటీ
X
ఆంధ్ర‌ప్రదేశ్ కాంగ్రెస్ క‌మిటీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావును నెహ్రూ కల్సి ఏకాంతంగా సంభాషించిన‌ట్లు వెలువ‌డిన వార్త‌లు సృష్టించిన క‌ల‌క‌లం మ‌రువ‌క ముందే....తాజాగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు ఆ పార్టీ యువ‌నేత నారా లోకేష్‌ తో భేటీ అయిన‌ట్లు తేలింది. ఈ మేర‌కు వెలువ‌డిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఇంట‌ర్నెట్లో వైర‌ల్ అయిన ఈ చిత్రంలో నారా లోకేష్‌ తో దేవినేని నెహ్రూ ఆత్మీయ భోజ‌న మంత‌నాలు సాగిస్తున్నారు. ఈ చిత్రంలో నెహ్రూ చిర‌కాల ప్ర‌త్య‌ర్థి ఆయ‌నకు స‌మీప బంధువైన‌ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు కూడా ఉన్నారు. అంతేకాకుండా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, మ‌రో ఇద్ద‌రు నాయ‌కులు ఉన్నారు. ఈ చిత్రంలో లోకేష్‌తో నెహ్రూ మంత‌నాలు సాగిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ ఫొటో చ‌లామ‌ని కావ‌డంతో ఇన్నాళ్లు దేవినేని నెహ్రూ సైకిలెక్క‌డంపై సాగిన ప్ర‌చారం నిజ‌మ‌ని తేలింద‌ని అంటున్నారు. నారా లోకేష్ నిర్వ‌హించిన ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయింద‌నే టాక్ న‌డుస్తోంది.

1983 తెలుగుదేశం ఆవిర్భావ సమావేశంలోనే ఆ పార్టీలో ప్రవేశించి రాజకీయ ఆరంగ్రేటం చేసిన నెహ్రూ కంకిపాడు నుంచి ఆ పార్టీ తరఫున 1983, 85, 89, 94 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. తెలుగుదేశంలో చీలిక ఏర్పడినపుడు ఎన్టీఆర్ పక్షాన నిలువటమేగాక లక్ష్మీ పార్వతి నాయకత్వంలో పనిచేస్తూ 1998 పార్లమెంటు ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఐదోసారి గెలిచారు. నియోజకవర్గ పునర్విభజనతో 2009 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో తిరిగి పోటీచేసి మరోమారు ఓటమి పాలయ్యారు. నెహ్రూ తెలుగుదేశంలో చేరాలనే నిర్ణయంపై కృష్ణా జిల్లాలో ప్రకంపనలు రేగుతున్నాయి.