Begin typing your search above and press return to search.
ట్వీట్ పోస్టింగ్ లో తప్పు చేసిన చినబాబు
By: Tupaki Desk | 6 May 2017 5:32 AM GMTతప్పు మానవ సహజం. కానీ.. కొందరు తప్పులు చేసినా ఫర్లేదు. కానీ.. మరికొందరు చేసే తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు కమ్ ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిదని చెప్పక తప్పదు. రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాలు మాత్రమే కానీ అధికారికంగా ప్రభుత్వ వ్యవహారాలు చూడటం ఈ మద్యనే షురూ చేశారు. ఒక ప్రముఖ నేత వారసుడి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో ఆయన మాటలు.. చేతలు ఇలా అన్నింటిపైనా ఒక కన్నేసి ఉంటారు ప్రజలు. ఇలాంటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
ఎందుకలా జరుగుతుందో తెలీదు కానీ.. లోకేశ్ విషయంలో తప్పులు తరచూ జరుగుతున్నాయి. అంబేడ్కర్ జయంతిని వర్థంతిగానూ.. ఏపీ అసెంబ్లీ సీట్ల విషయంలోనూ.. ఈ మధ్యన మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలోనూ తప్పుల్ని అలవోకగా చేసేస్తున్నారు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న విపక్షాలు.. ఆయన తీరును తప్పు పడుతున్నాయి.
పవర్ చేతిలో ఉన్న వేళ.. ఇలా తప్పులు ఎత్తి చూపించుకోవటం లోకేశ్ లాంటోళ్లకు అస్సలు నచ్చదు. తప్పుల్ని ఎత్తి చూపిస్తే అసహనం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ క్రమంలో బ్యాలెన్స్ మిస్ కావటం సహజంగా జరిగేది. తాజాగా లోకేశ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. తన మీద వచ్చే విమర్శలు.. ఆరోపణల విషయంలో ఆయన బ్యాలెన్స్ మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. తనను తప్పు పట్టే వారిపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇలాంటివి మరింత నెగిటివ్ ప్రచారానికి దారి తీస్తాయన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం చినబాబుకు ఉంది.నిన్నటి వరకూ మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లగా.. తాజాగా ఆయన చేసిన ట్వీట్ లో తప్పు దొర్లటం గమనార్హం.
అమరావతిలో మండలి ఛైర్మన్ చక్రపాణిని కలుసుకోవటం సంతోషంగా ఉందంటూ చినబాబు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. దానికి ఒక ఫోటోను జత చేశారు. అయితే.. ఆయన జత చేసిన ఫోటోలో చక్రపాణి లేకపోవటం గమనార్హం. అధికారిక పేజీలో పోస్ట్ చేసిన చక్రపాణి లాంటి రాజకీయ నేతను కలుసుకున్నట్లుగా ఉండి.. జత చేసిన ఫోటోలో ఆయన లేకపోవటాన్ని సోషల్ మీడియాలో పలువురు ఎత్తి చూపుతున్నారు. ఇంతకాలం నోటి మాటల్లోనే తప్పులు దొర్లుతున్న లోకేశ్ తీరుకు తగ్గట్లే ఇప్పుడాయన పోస్ట్ చేసిన పోస్ట్ సైతం తప్పు కావటం ఆసక్తికరంగా మారింది. ఈ తప్పును పలువురు ఎత్తి చూపిస్తూ.. వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/