Begin typing your search above and press return to search.
సోషల్ మీడియాపై లోకేష్ ఉక్కుపాదం..ఒక సంస్థకు కాంట్రాక్ట్!
By: Tupaki Desk | 21 March 2019 10:50 AM GMTసోషల్ మీడియాలో తన తప్పులను పట్టి చూపుతున్న వారి మీద, తనను ‘పప్పు’ గా నిరూపిస్తున్న వారి మీద ఫైర్ అయిపోతున్నాడట నారా లోకేష్ బాబు. ఒకవైపు జనాల మధ్యకు వస్తూ తన ప్రసంగాలతో కడుపుబ్బా నవ్వులు పండిస్తూ.. తను నవ్వుల పాలవుతున్న లోకేష్.. తన తీరును మార్చుకోవడం లేదు కానీ.. తన గురించి స్పందిస్తున్న వారిని మాత్రం లక్ష్యంగా చేసుకొంటూ ఉన్నారట.
ఈ విషయంలో ఎన్నికల వేళ తీవ్రమైన కసరత్తు సాగుతూ ఉందని వార్తలు వస్తున్నాయి. చాలా కాలం నుంచినే సోషల్ మీడియాను లోకేష్ ప్రత్యేకంగా టార్గెట్ గా చేసుకున్నారనే మాట వినిపిస్తూ ఉంది.
గొంతు ఎత్తితే వారిమీద కేసులు పెట్టడం.. చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటుగా సాగుతూ ఉంది. అనేక మంది అరెస్టులు జరిగాయి. అయితే కోర్టు తీర్పులతో వారంతా బయటపడ్డారు. అయితే ఎన్నికల వేళ మళ్లీ కథ మొదటకు వచ్చినట్టుగా సమాచారం.
లోకేష్ మీద - తెలుగుదేశం పార్టీ మీద సెటైరిక్ పోస్టులు పెడుతూ… సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నెటిజన్లను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మూడేళ్ల నుంచి ఇదే కథ సాగుతూ ఉంది. ఇక ఎన్నికల వేళ ఇందుకు సంబంధించి మరో కథ మొదలుపెట్టాడట లోకేష్ బాబు. అనేక ఫేస్ బుక్ పేజీలను - యూట్యూబ్ చానళ్లను లక్ష్యంగా చేసుకుని.. ఆన్ లైన్ లో కంప్లైంట్స్ ఫైల్ చేస్తూ.. .అవి స్ట్రైక్ ఆఫ్ అయ్యేలా చూస్తున్నారట. ఇప్పటికే పలువురు నెటిజన్ల ఫేస్ బుక్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి. అలాగే అనేక యూట్యూబ్ చానాళ్లను గల్లంతు చేసేశారు.
వాటికి సంబంధించి ఏవైనా కాపీ రైట్స్ కంటెంట్ ఆధారంగా చేసుకుని.. వాటిపై కంప్లైంట్ చేసి.. వాటిని బ్లాక్ చేయించారనే మాట వినిపిస్తూ ఉంది. తన తీరును ఎండగడుతున్న వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి - వారిని వేధించే కాంట్రాక్ట్ ను ఒక సంస్థకు అప్పగించాడట లోకేష్.
ఈ పేరుతో సోషల్ మీడియా మీద ఇలా ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతూ ఉందని సమాచారం. తన తీరును మార్చుకుని - తనను విమర్శించే వారికి బదులు ఇవ్వలేక..లోకేష్ తనను విమర్శించే వారి గొంతు నొక్కాలని ప్రయత్నిస్తూ ఉన్నారని - ఇదీ ఏపీ మంత్రిగారి తీరు అని నెటిజన్లు వాపోతూ ఉన్నారు.