Begin typing your search above and press return to search.
లోకేష్ బాబుకు అంత ఈజీ కాదు..ఇప్పుడూ అదేమాట!
By: Tupaki Desk | 1 April 2019 12:23 PM GMTపోలింగ్ కు సమయం ఆసన్నం అవుతూ ఉన్నా.. మంగళగిరి పరిస్థితిలో మాత్రం పెద్దగా మార్పు లేదనే విశ్లేషణలే వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా తెరమీదకు వస్తున్న సర్వేలు కూడా… అదే మాటే చెబుతున్నాయి. మంగళగిరిలో ఎవరు గెలుస్తారో చెప్పడం అంత తేలిక కాదు.. అని వివిధ సర్వేలు తేల్చి చెబుతున్నాయి. చెప్పడం తేలిక కాదు.. అని అంటోందంటే.. అది లోకేష్ బాబు విజయం సాధిస్తారని చెప్పడం కూడా కష్టమే అని స్పష్టం అవుతోంది.
అలాగని లోకేష్ బాబు ఓడిపోతారని కూడా తేల్చేయడం లేదు. పరిస్థితి చాలా టఫ్ గా ఉంటుందని మాత్రం సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. లోకేష్ బాబు రంగంలోకి దిగారు కాబట్టి.. అక్కడ వార్ వన్ సైడ్ అవుతుంది..అని అనుకోవడం భ్రమే అని అంటున్నాయి సర్వేలు.
గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ కేవలం పన్నెండు ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే.. ఇప్పుడు స్వయంగా లోకేష్ పోటీ చేస్తున్నాడు కాబట్టి.. ఆ పన్నెండు ఓట్లు ఇటు పడిపోతాయి, లోకేష్ గెలిచేస్తాడని తేలికగా చెప్పే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
మారిన సమీకరణాల నేపథ్యంలో గత ఎన్నికల ఫలితాలకూ ప్రస్తుతానికీ సంబంధం లేదని వారు అంటున్నారు. ఆ పన్నెండు ఓట్లు అటూఇటూ అయిపోతే కథ మారిపోతుందనేందుకు లేదని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో లోకేష్ పట్ల మిక్స్ డ్ రియాక్షన్ వస్తోంది. చంద్రబాబు నాయుడు తనయుడు అనేదే లోకేష్ కు ఉన్న ప్రధానమైన అర్హత. దీన్ని క్యాష్ చేసుకొంటూ.. తనను గెలిపిస్తే మంగళగిరి గచ్చిబౌలీ అవుతుందంటూ లోకేష్ బాబు చెబుతున్నారు. ఇది జనాలకు బాగానే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది!
అయితే ఇదే సమయంలో లోకేష్ బాబు ‘పప్పు’ ఇమేజ్ కూడా కొనసాగుతూ ఉంది. ఎన్నికల ప్రచారంలో కూడా లోకేష్ బాబు మాట్లాడుతూ.. పోర్టును కేసీఆర్ ఎత్తుకపోతారని అనడం హాస్యాస్పదంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో జనాలు రెండు అంశాలనూ పరిశీలిస్తూ ఉన్నారు. లోకేష్ హామీలనూ పరిశీలిస్తున్నారు. ఆయన మాట్లాడిన మాటల్లోని హాస్యాన్నీ ఆస్వాధిస్తున్నారు. ఈ రెండు అంశాలూ కూడా లోకేష్ బాబు భవితవ్యాన్ని డిసైడ్ చేసేవే. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల స్థానికుడుగా ప్రజలకు అందుబాటులో ఉండటం, లోకేష్ గెలిస్తే అందుబాటులో ఉంటారా.. అనే సందేహాలూ నెలకొని ఉన్నాయి. మొత్తానికి మంగళగిరి పరిస్థితి ప్రస్తుతానికి చెప్పడానికి ఏమీ లేదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఈ మాటలు అక్కడ రాజకీయాన్ని మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి!