Begin typing your search above and press return to search.
మరోసారి పప్పులో కాలేసిన లోకేష్!
By: Tupaki Desk | 14 Jan 2020 10:59 AM GMTనారా లోకేష్ ..ఏపీ మాజీ మంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడి గొప్పతనం గురించి అందరికి తెలిసిందే. జయంతికి - వర్ధంతి కి తేడా కూడా తెలియని టీడీపీ కీలక నేత. ఈయన ఏ క్షణం లో ఏవిధంగా ఏమి మాట్లాడతారో ఎవరికీ కూడా తెలియదు. అయన కావాలని ఆలా చెప్తాడో కానీ , మాటలు తడబడి ఆలా మాట్లాడతాడో కానీ ,ఎక్కువగా ట్రోల్ కి దొరికేస్తుంటారు. తాజాగా మరోసారి లోకేష్ నోరుజారాడు.
లోకేశ్ మరోసారి తన విచిత్ర వ్యాఖ్యలతో ప్రజలను - కార్యకర్తలను అయోమయానికి గురి చేశారు. ‘అమరావతిలో మేం దాడి చేస్తే పోలీసులు మా మీద కేసులెలా పెడతారు అంటూ వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతినే ఉంచాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో బాపట్లలో లోకేశ్ సోమవారం పాదయాత్ర నిర్వహించారు. అనంతరం బీఆర్ అంబేడ్కర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అమరావతి ఉద్యమానికి డబ్బులు అవసరం లేదని చెప్పారు.
అమరావతిలో సన్న - చిన్నకారు - దళిత అసైన్డ్ భూముల రైతుల కోసం పోరాటం చేస్తుంది తామేనన్నారు. అయితే.. అంబేడ్కర్ భవనంలో సమావేశం నిర్వహించి ఆయన సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించిన లోకేశ్ కనీసం అంబేడ్కర్ విగ్రహానికి - చిత్రపటానికి నివాళి అర్పించకపోవడం విమర్శలకు తావిచ్చింది. దళితులు లోకేశ్ తీరుపై మండిపడ్డారు.ఇకపోతే అమరావతిలోనే రాజధాని కావాలి అంటూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న నిరసనలకు టీడీపీ మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే.