Begin typing your search above and press return to search.
లోకేష్ కు అన్ని వాళ్ల నాన్న బుద్ధులే
By: Tupaki Desk | 7 March 2019 1:30 AM GMTపార్టీ ఎప్పుడూ ఒక కుటుంబం కిందే ఉండాలి. రెండో వ్యక్తిని రానిస్తే అసలుకే మోసం వస్తుందనే విషయం చంద్రబాబుకి బాగా తెలుగు. అందుకే పార్టీలో వేరెవ్వరిని తనకంటే ఎక్కువుగా ఎదగనివ్వలేదు. ఇప్పుడు తాను తప్పుకుంటే ఆ ప్లేస్ ని లోకేష్ భర్తీ చెయ్యాలి. అందుకే లోకేష్ ని ఒక నాయకుడిగా మార్చేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. ఇలాంటి టైమ్ లో లోకేష్ కు పోటీ వస్తే.. బాబు ఒప్పుకుంటాడా. అదే జరుగుతోంది ఇప్పుడు.
బాలయ్యకు ఇద్దరు అల్లుళ్లు. పెద్ద అల్లుడు లోకేష్. రెండో అల్లుడు ఎంవీఎస్ ఎస్ మూర్తి మనవడు శ్రీభరత్. ఎంవీఎస్ ఎస్ మరణంలో శ్రీ భరత్ కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీచేయాలని అనుకుంటున్నాడు. అయితే..ఇప్పుడు శ్రీభరత్ కు సీట్ ఇస్తే తన పరిస్థితి ఏంటి. రేపొద్దున్న ఏకు మేకు అయిపోతే. ఇదే ఆలోచన వచ్చిందట లోకేష్ కు. ఇదే విషయాన్ని చంద్రబాబుకి చెప్పారట లోకేష్. దీంతో.. వచ్చే ఎన్నికల్లో శ్రీభరత్ కు సీటు కష్టమనే వార్త.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తెలుస్తోంది. క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా.. ఈసారి విశాఖ ఎంపీ స్థానం కాపులకు ఇవ్వాలని.. అందువల్ల ఈ ఒక్కసారికి త్యాగం చేయాల్సిందేని ఇన్ డైరెక్ట్ గా చెప్పారని సమాచారం. ఇప్పట్లో ఎమ్మెల్సీ కూడా లేదు. అంటే మరో రెండేళ్లపాటు శ్రీభరత్ ప్రభుత్వంలోకి వచ్చే అవకాశమే లేదు. గతంలో చంద్రబాబు కూడా ఇంతే ఎన్టీఆర్ అల్లుడిగా చలామణి అయ్యి దగ్గుబాటి వెంకటేశ్వరరావుని ఎదగనివ్వలేదు. ఇప్పుడు లోకేష్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అన్పించుకుంటున్నాడని.. శ్రీభరత్ ని చాలా కామ్ గా తప్పించేశాడని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇదే విషయాన్ని బాలయ్యకు కూడా చెప్పి కాస్త సముదాయించమని కోరాడట లోకేష్. పాపం బాలయ్య.. ఏం చెప్తాడు ఎలా చెప్తాడు. కానీ చెప్పాలి, తప్పదు. చెప్పకపోతే.. ఈసారి ఎన్నికల్లో ఆయనకు సీటు కష్టమే మరి.