Begin typing your search above and press return to search.

లోకేశ్ మాట‌తో షాక్ తిన్న తెలుగు త‌మ్ముళ్లు!

By:  Tupaki Desk   |   18 March 2019 3:40 AM GMT
లోకేశ్ మాట‌తో షాక్ తిన్న తెలుగు త‌మ్ముళ్లు!
X
కీల‌క‌మైన స్థానాల్లో ఉన్న వారి మాట‌ల‌కు ఉండే ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. వారి నోటి నుంచి వ‌చ్చే ప్ర‌తి మాటను కోట్లాది మంది నిశితంగా ప‌రిశీలిస్తుంటారు. అందుకే.. ప్ర‌ముఖుల నోటి నుంచి వ‌చ్చే ఏ చిన్న త‌ప్పుడు మాట‌కు విస్తృత‌మైన ప్ర‌చారం రావ‌టమే కాదు.. వేలెత్తి వాయి తీస్తుంటారు. పెరిగిన సోష‌ల్ మీడియా విస్తృతి.. వాట్సాప్ పుణ్య‌మా అని.. నేత‌లు మాట‌ల్లో దొర్లే త‌ప్పులు.. వారి స్పీచుల్లో లోపాల్ని చిట్టి వీడియోలుగా మార్చేయ‌టం.. ప‌లువురికి షేర్ చేయ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది.

ఇదంతా ఎందుకంటే.. మాట్లాడే విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి కుమారుడు లోకేశ్ టాలెంట్ ఏమిటో తెలుగు ప్ర‌జ‌ల‌కు బాగానే తెలుసు. నోరు విప్ప‌నంత వ‌ర‌కూ లోకేశ్ బాబు ఓకే. కానీ.. ఆయ‌న ఒక్క‌సారి నోరు విప్పి నాలుగు మాట‌లు మాట్లాడారా? అప్ప‌టివ‌ర‌కూ ఉర‌క‌లెత్తే ఉత్సాహంతో ఊగిపోయే తెలుగు త‌మ్ముళ్లు సైతం నీర‌సించిపోతారు.

మాట్లాడ‌టం రాక‌పోవ‌ట‌మో.. ఏ ప‌దాన్ని ఎప్పుడు.. ఎక్క‌డ ఉప‌యోగించాల‌న్న విష‌యంలో లోకేశ్ కు ఉండే క‌న్ఫ్యూజ‌నో కానీ ఇప్ప‌టికే ప‌లుమార్లు ఆయ‌న సోష‌ల్ మీడియాలో న‌వ్వుల‌పాల‌య్యారు.

త‌ప్పులు చేయ‌నోళ్లు ఉండ‌రు. కానీ.. త‌న త‌ప్పుల్ని తెలుసుకొని.. వాటిని స‌రిదిద్దుకోవ‌టం.. త‌ప్పుల్ని అధిగ‌మించ‌టం చాలా అవ‌స‌రం. కానీ.. ఈ త‌ర‌హా ఎక్స‌ర్ సైజ్ ను లోకేశ్ పెద్ద‌గా చేయ‌రేమో. ఈ కార‌ణంతోనే ఆయ‌న నోటి నుంచి వ‌చ్చే మాట‌లు సంద‌ర్బోచితంగా అస్స‌లు ఉండ‌వు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. అయ్యో ఇలా జ‌రిగిందేమిట‌ని త‌ల్ల‌డిల్లేలా చేసిన వైఎస్ వివేకా దారుణ‌హ‌త్యపై తాజాగా లోకేశ్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి. ఆయ‌న మాట‌ల్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఇక‌.. తెలుగు త‌మ్ముళ్లు అయితే.. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ ఇలా మాట్లాడితే పార్టీ ప‌రిస్థితి ఏం కావాలంటూ త‌ల‌లు ప‌ట్టుకునే ప‌రిస్థితి.

ఇంత‌కీ ఆయ‌నేమ‌న్నారంటే.. పాపం వివేకానంద‌రెడ్డి చ‌నిపోయారు. ఆ విష‌యం తెలిసి ప‌ర‌వ‌శించానంటూ చేసిన వ్యాఖ్య‌లు షాకింగ్ గా మారాయి. హ‌త్య గురించి తెలిసి షాక్ తిన్నా లాంటి మాట‌ల స్థానంలో ప‌ర‌వ‌శించానంటూ అసంద‌ర్భ ప్రేలాప‌న చేయ‌టంతో బిత్త‌ర‌పోవ‌టం తెలుగు త‌మ్ముళ్ల ప‌నైంది. కావాల‌ని కాకున్నా..త‌త్త‌ర‌పాటో.. లేదంటే ఏ టైంలో ఏం మాట్లాడాల‌న్న విష‌యంలో క్లారిటీ లేక‌పోవ‌టంతోనే ఈ త‌ర‌హా వ్యాఖ్య చేసి ఉంటార‌ని చెబుతున్నారు.


వీడియో కోసం క్లిక్ చేయండి