Begin typing your search above and press return to search.
అప్పట్లో నాన్న మాట్లాడింది తెలుసా చినబాబు?
By: Tupaki Desk | 6 Feb 2017 4:07 PM GMTపదేళ్లు అధికారానికి దూరంగా ఉండి.. ఏవరేం అడిగినా ఓకే అనటమే తప్పించి మరో మాట చెప్పకుండా.. అందరి మనసుల్ని దోచేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్న తెలుగు తమ్ముళ్లకు గడిచిన మూడేళ్లుగా చేతిలో ఉన్న పవర్ బాగానే నెత్తికి ఎక్కేసినట్లుగా కనిపిస్తోంది. విభజనకు అసలుసిసలు కారణమైన ‘లేఖ’ను రెండు కళ్ల సిద్ధాంతం పేరిట చంద్రబాబు ఇచ్చేసినా.. ఆంధ్రోళ్లు సర్లేనని సర్దుకొన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు మర్చిపోయినట్లుగా ఉంది.
విభజన కారణంగా ఎదురైన అవమానం.. ఆర్థిక నష్టాన్ని ప్రతిచోటా ప్రస్తావిస్తూ.. తన లాంటి అనుభవం ఉన్న నేత కానీ ఏపీ ముఖ్యమంత్రి అయితే.. అన్ని తీసుకొస్తానని.. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అణాపైసలతో సహా న్యాయం చేయనిదే నిద్రపోనంటూ బాబు చెప్పిన మాటల్ని సొంత పార్టీ నేతల తర్వాత.. ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే నమ్మారు. మీకెంత అన్యాయం జరిగిందో తెలుసు.. నేనున్నాను.. మీకు ప్రత్యేక హోదానే కాదు.. ఢిల్లీని మరిపించే రాజధానిని కట్టించి ఇస్తానంటూ మోడీ లాంటోడు వచ్చేసి ఏపీ లోగిళ్లలో మాట్లాడటంతో పరవశించిపోయిన ఆంధ్రప్రజలకు.. పవన్ కల్యాణ్ ‘పవర్ ఫుల్’ హామీతో వెనుకా ముందు చూసుకోకుండా బాబుకు ఓట్లేసేశారు.
అధికారంలోకి వచ్చిన బాబుకు.. తిరుగులేని మెజార్టీని సొంతం చేసుకున్న మోడీకి.. ఎన్నికల వేళ చెప్పిన మాటలు.. ఇచ్చిన హామీల్ని దాదాపుగా మర్చిపోయారు. సామాన్య ప్రజలకు ఇదేం కొత్త అనుభవం కాదు. ఇలాంటివి గతంలోనూ చాలానే చూశారు. కాకపోతే.. గతంలో లేనిది.. తాజాగా వచ్చిందేమిటంటే.. గతంలో చేయని పని గురించి ప్రస్తావించేవారు. మర్చిపోయినట్లు వ్యవహరించేవారు.
కానీ.. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు ట్రెండు మార్చారు. మోసం మీద మోసం తమకు జరుగుతుందన్న ఆవేదన చెందుతున్న ఆంధ్రోళ్లను గుచ్చి.. గుచ్చి మరీ తమ మాటలతో గుర్తు చేస్తున్న వైనం ఇప్పుడు మంటపుట్టిస్తోంది. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చటంలో ఏవో తలనొప్పులు వచ్చాయని అనుకుందాం. ఆ విషయాన్ని అక్కడితో వదిలేయొచ్చు. కానీ.. అలా చేయకుండా ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ఎంత గొప్పో తెలుసా? అంటూ ఒళ్లు మండే మాటల్నిచెప్పటం ఈ మధ్యన ఎక్కువైంది.
తమకు న్యాయబద్ధంగా.. ధర్మబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదా గురించిగళం విప్పిన వారిని ఎటకారం చేస్తూ కేంద్రమంత్రి సుజనా చౌదరి.. పందుల పోటీ పెట్టుకోండంటూ జల్లికట్టు నేపథ్యంలో అన్న మాటల్ని ఆంధ్రోడు ఎప్పటికి మర్చిపోలేరు. ఇలాంటి మాటల వల్ల జరిగే నష్టం ఎక్కువన్న విషయాన్ని బాబు సుజనాకు క్లాస్ పీకిన తర్వాత ఆయన తగ్గినా.. మిగిలిన తమ్ముళ్లు ఎక్కడో ఒక చోట హోదా ముగిసిన అధ్యాయమంటూ కారం పూసే మాటల్ని మాట్లాడుతున్నారు.
తాజాగా అలాంటి పనే చేశారు చంద్రబాబు పుత్రరత్నం.. కమ్ టీడీపీ జనరల్ సెక్రటరీ అయిన లోకేశ్ బాబు ఆంధ్రోళ్లకు మంట పుట్టే మాట చెప్పారు. హోదా కంటే ప్యాకేజీనే మేలన్న మాటను చెప్పిన లోకేశ్.. హోదాతో వచ్చే లాభాలన్నీ ప్రత్యేక ప్యాకేజీతో వస్తున్నట్లుగా వెల్లడించారు.2017తో ప్రత్యేక హోదాను రద్దు చేస్తామని కేంద్రం చెబుతోందంటూ పాచిపోయిన మాటల్నిచెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా మీద ఆంధ్రళ్లకున్న ఆశలు అన్నిఇన్నికావు. వాటిని నీరు కారుస్తూ.. ప్రత్యేక ప్యాకేజీని ప్రమోట్ చేసేలా లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆంధ్రోళ్లకు కడుపు మండించేవే. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. హోదా కంటే ప్యాకేజీ గొప్పదని చెబుతున్న లోకేశ్.. మరి.. ఆ ప్యాకేజీకి కేంద్రం ఇప్పటివరకూ ఎందుకు చట్టబద్ధత కల్పించలేదు? హోదాపై లోకేశ్ చేసిన వ్యాఖ్యల్ని విన్నప్పుడు కలిగే భావం ఒక్కటే.. ఒంటికి కారం పూసేలా మాట్లాడటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావ్ లోకేశ్ బాబు అని.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/