Begin typing your search above and press return to search.
మరి.. నాన్న అలా ఎందుకు చేశారు చినబాబు?
By: Tupaki Desk | 25 May 2016 4:49 PM GMTరూల్ అంటే రూల్ మాదిరే ఉండాలి కానీ ఒక పదవికి ఒక రూలు.. మరో పదవికి మరో రూల్ ఉండకూడదు. ఇప్పుడు ఇదే సందేహంతో కొట్టుమిట్టాడుతున్నారు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు. నిజమే.. వారి ఆవేదనలోనూ పాయింట్ ఉంది మరి. తాజాగా.. రాజ్యసభ సభ్యత్వానికి అవకాశం రావటంతో తెలుగు తమ్ముళ్ల ఆశలకు రెక్కలు వచ్చేసిన పరిస్థితి. పార్టీ పవర్ లో ఉన్నా పదవులు రాని ఏపీ తమ్ముళ్లు ఓపక్క.. పవర్ లో వచ్చే ఛాన్స్ కనుచూపు మేర లేని తెలంగాణ తమ్ముళ్లు.. రాజ్యసభ సభ్యత్వం కోసం పోటీకి వచ్చేశారు.
కోటా ఏదైతే కానీ.. తమను ఏదోలా రాజ్యసభ టిక్కెట్టు ఇచ్చేసి పంపిస్తే బాబు పేరు చెప్పేసుకొని బతికేస్తామన్నది తెలంగాణ తమ్ముళ్ల ఆశ. ఆరే.. మా ఎమ్మెల్యేల కారణంగా వచ్చే పదవులు కూడా మీరే లాగేసుకుంటే ఎలా అన్నది ఏపీ తమ్ముళ్ల వాదన. దీనికి తెలంగాణ తమ్ముళ్ల కౌంటర్ ఏమిటంటే.. అరే.. భయ్.. మీకు ఈ పదవి కాకుంటే వేరే పదవులు చాలానే వస్తాయి.. కానీ మాకు అలా కాదుగా అన్నది వారి వాదన.
దీనికి తగ్గట్లే.. మొన్నటివరకూ గవర్నర్ గిరి మీద ఆశలు పెట్టుకొని.. అది అయ్యే పని కాదన్న విషయాన్ని అర్థం చేసుకొని.. కనీసం రాజ్యసభ పోస్ట్ అయినా ఇప్పించాలంటూ తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగేశారు తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు. ఆయన మాదిరి మరికొందరు తెలంగాణ తమ్ముళ్లు పదవుల మీద ఆశ పెట్టుకోవటంతో.. ఇలాంటివి మొగ్గలోనే తుంచేయాలని అనుకున్నారో ఏమో కానీ.. చినబాబు లోకేశ్ మైకు పట్టేసుకున్నారు.
కొద్దిసేపటి క్రితం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన.. ఏపీ నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల్ని రాజ్యసభకు పంపించే ఛాన్సే లేదని తేల్చేశారు. అయినా ఏపీ కోటాను తెలంగాణకు ఏ విధంగా ఇస్తామంటూ పెద్ద ప్రశ్ననే సంధించారు. లోకేశ్ బాబు నోట్లో నుంచి వచ్చిన మాట తెలంగాణ తమ్ముళ్లకు సమ్మెటపోటుగా మారిన పరిస్థితి. ఆయన నోటి నుంచి కోటా మాట వచ్చిందంటే.. తెలంగాణ తమ్ముళ్ల ఆశలకు చెక్ పడినట్లే. ఇంతకాలం ఏదో విధంగా పదవులు వస్తాయని బోలెడన్ని ఆశలు పెట్టుకున్న తెలంగాణ తమ్ముళ్ల ఆశల మీద తన నోటిమాటతో గ్యాలన్ల కొద్దీ నీళ్లు కుమ్మరించేశారు లోకేశ్.
ఏపీ రాజ్యసభ సీటును తెలంగాణ నేతలకు కేటాయించటం ఎలా కుదురుతుందన్న లోకేశ్ లా పాయింట్ కు నేరుగా సమాధానం చెప్పలేని తెలంగాణ తమ్ముళ్లు పలువురు.. లోగుట్టుగా మాత్రం తమ ఆక్రోశాన్ని పాయింట్ల వారీగా తెర మీదకు తెచ్చేశారు. కోటా మాట్లాడుతున్న చిన్నబాబు.. అంతకు ముందు పార్టీ అధినేత చంద్రబాబు.. ఏపీకి చెందిన టీటీడీ బోర్డులో తెలంగాణ నేతకు పదవిని ఎందుకు కేటాయించినట్లు? అన్న సందేహాన్ని సూటిగా అడిగేస్తున్నారు. అంతేకాదు.. రీసెంట్ గా ఢిల్లీలో చంద్రబాబు మీడియా వ్యవహారాల కోసం తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టును ఎందుకు ఎంపిక చేసుకున్నట్లు? అన్న సందేహాన్ని సైతం తెర మీదకు తెచ్చేస్తున్నారు. ఇన్ని పదవులు తెలంగాణ వారికి ఇచ్చినప్పుడు.. రాజ్యసభ సీటు కోసం ఆశ పడటం తప్పేం కాదుగా అన్నది తెలంగాణ తమ్ముళ్ల వాదన. కోటా గురించి ఇప్పుడు కొత్త వాదనను తెర మీదకు తెస్తున్న లోకేశ్.. గతంలో తన తండ్రి.. పార్టీ అధినేత చంద్రబాబు అనుసరించిన విధానం మీద ఏం సమాధానం చెబుతారో..?
ఏపీ పదవుల మీద తెలంగాణ నేతలు ఎలా కోరుకుంటారని చినబాబు మాటకు.. తమ్ముళ్ల లేవనెత్తుతున్న వాదనకు చినబాబు ఏం సమాధానం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజమే.. తెలంగాణ తమ్ముళ్లు లేవదీసిన సందేహాల్లోనూ పాయింట్ ఉందనే చెప్పాలి. ఒక పదవికి ఒక రూల్.. ఇంకో పదవికి ఇంకో రూల్ ఉండదు కదా. ఆనవాయితీ అన్నది ఉంటే అన్నింటికి ఒకేలా ఉండాలే తప్ప.. సమయానికి తగ్గట్లుగా మాటలు చెప్పేయటం సరికాదన్నది తెలంగాణ తమ్ముళ్ల వాదన. నిజమే.. సమయానికి తగ్గట్లుగా తమ వాదనను వినిపిస్తే నేతలకు తమ మాటలు సంతృప్తి పర్చలేవన్న విషయానని చినబాబు గుర్తిస్తే మంచిదేమో..?