Begin typing your search above and press return to search.
జగన్ .. తన క్రిమినల్ రూపాన్ని బయటపెట్టాడు: నారా లోకేష్ ఫైర్
By: Tupaki Desk | 3 Aug 2022 5:30 PM GMTసీఎం జగన్ తన క్రిమినల్ రూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని టీడీపీ యువ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ‘‘డోర్ నెంబర్‌కు సర్వే నెంబర్‌కు తేడా తెలియని కిరాయిగాళ్లతో మా చిన్నమ్మ మరణంపై విషప్రచారం చేయిస్తున్నారు.
కోడికత్తి డ్రామా, బాబాయ్ గుండెపోటు అంటూ ఆస్కార్ రేంజ్ నటన, ఒకే కులం డీఎస్పీలకు ప్రమోషన్లు, పింక్ డైమండ్ పేరుతో విషప్రచారం చేశారు. నేడు తప్పుడు సర్వే నెంబర్లు సృష్టించి మా చిన్నమ్మ మరణంపై విషప్రచారం చేయబోయి బొక్కబోర్లా పడ్డారు’’ అని లోకేష్ దుయ్యబట్టారు.
తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాలని సంతకాలు చేసిన నీచ చరిత్ర జగన్‌దని ద్వజమెత్తారు. ఎన్నికల్లో సానుభూతి కోసం బాబాయ్ మరణాన్ని వాడుకున్నారని, జనాన్ని దోచుకుని, నెత్తుటి కూడు తింటూ.. తరతరాల రక్తచరిత్రకు వారసుడు జగన్‌రెడ్డేనని చెప్పారు.
చిన్నమ్మ ఉమామహేశ్వరి మరణంతో తాము విషాదంలో ఉంటే.. విషప్రచారం చేస్తూ వినోదం పొందుతారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతల పైశాచిక ఆనందానికి ఎక్స్‌పెయిరీ డేట్ దగ్గర పడింది జగన్‌రెడ్డి అని లోకేష్ హెచ్చరించారు.
పోలీసులకు ఫిర్యాదు..
అన్నగారి చిన్న కుమార్తె ఉమామహేశ్వరి.. ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి అన్నగారి కుటుంబం సహా.. అభిమానులు.. టీడీపీ నాయకులు కూడా ఇంకా తేరుకోలేదు. అయితే.. ఇంత విషాదాన్ని కూడా తమ రాజకీయాలకు వినియోగించుకునేలా.. వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ డిజిటల్ విభాగం.. చైర్మన్‌గా ఉన్న గుర్రంపాటి దేవేందర్ రెడ్డి `హూ కిల్డ్ పిన్ని` హ్యాష్‌ట్యాగ్‌తో రెండు రోజులుగా నానా రచ్చ చేస్తున్నాడు.
మరోవైపు.. పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తెలుగు యువత అధ్యక్షులు డా. పొగాకు జైరామ్ చందర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.