Begin typing your search above and press return to search.
టార్గెట్ అదే : పవన్ వెంట పడుతున్న లోకేష్...?
By: Tupaki Desk | 3 Aug 2022 12:30 AM GMTతెలుగుదేశం యువ నాయకుడు. భావి వారసుడు నారా లోకేష్ మంచి దూకుడు మీద ఉన్నారు. ఆయన స్పీడ్ కి జోహార్ అని తమ్ముళ్ళు అనే రేంజిలో హల్ చల్ చేస్తున్నారు. చంద్రబాబు తరువాత అంతటి స్థానంలో ఉన్న లోకేష్ వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఎలాగైనా తీసుకురావాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయన తన వంతుగా ఏపీ అంతా ప్రస్తుతానికి కలియతిరుగుతున్నారు. మహానాడు తరువాత టీడీపీకి మంచి ఊపు వచ్చింది.
ఇక చంద్రబాబు పర్యటనలకు కూడా గతం కంటే ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. ఈ నేపధ్యంలో ఎన్నికల దాకా ఈ ఊపు కొనసాగాలంటే కచ్చితంగా పాదయాత్ర చేయాల్సిందే అని లోకేష్ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. చినబాబు ఇపుడు పాదయాత్ర మీదనే మొత్తం ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు.
ఆనాడు చంద్రబాబు పాదయాత్ర చేసి ఏపీలో అధికారాన్ని అందుకున్నారు. ఇపుడు తనయుడు లోకేష్ పాదయాత్ర సెంటిమెంట్ ని అందిపుచ్చుకుని మరోమారు బాబుని సీఎం చేసే బాధ్యతను తీసుకోనున్నారు. ఈ పాదయాత్ర వచ్చే ఏడాది మొదలవుతుంది అని మొదట్లో అనుకున్నా ఇపుడు మాత్రం షెడ్యూల్ బాగా ముందుకు తెచ్చారని టాక్. నిజానికి ఈ ఏడాది ఆగస్ట్ లో కానీ అక్టోబర్ లో కానీ పాదయాత్ర స్టార్ట్ చేయాలని లోకేష్ భావించారు.
అయితే అక్టోబర్ 5 విజయదశమి నుంచి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర మొదలెట్టి ఏపీ అంతటా ఒక రౌండ్ వేసే పనిలో ఉన్నారు. దాంతో నవంబర్ నుంచి లోకేష్ పాదయాత్ర చేయాలని పార్టీలో ముహూర్తం ఫిక్స్ చేశారని అంటున్నారు. వచ్చే ఏడాదే ఎన్నికలు ఉంటాయని టీడీపీ గట్టిగా ఊహిస్తున్న నేపధ్యంలో తాము ఎక్కడా వెనకబడిపోకుండా ఉండేందుకు లోకేష్ తో పాదయాత్రకు శ్రీకారం చుట్టించాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
లోకేష్ పాదయాత్ర ఎన్నికల షెడ్యూల్ వచ్చేంతవరకూ కొనసాగుతుందని అంటున్నారు. మొత్తానికి దాదాపు పదేళ్ళ క్రితం తండ్రి చంద్రబాబు పాదయాత్ర చేస్తే ఇపుడు తనయుడు లోకేష్ అదే పాదయాత్రను అందిపుచ్చుకోనున్నారు.
అంతే కాదు పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర మొదలైన నెల తరువాత లోకేష్ యాత్ర స్టార్ట్ అవుతుంది. అంటే పవన్ తో పోటీ పడుతూ వెంటబడుతూ లోకేష్ పాదయాత్ర సాగుతుంది అనుకోవాలేమో. ఈ పాదయాత్ర సక్సెస్ అవుతుందని టీడీపీ వర్గాలు ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాయని అంటున్నారు.