Begin typing your search above and press return to search.
మోకాళ్లతో నడిచినా లోకేష్ కు కష్టమేనా?
By: Tupaki Desk | 18 July 2019 8:26 AM GMTపండిత పుత్రుడు పామరుడు కాలేడన్నది సామెత. చంద్రబాబు ఎంత స్వయం కృషితో ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇన్నేళ్లు పాలించినా ఆయన పుత్రరత్నానికి మాత్రం బాబు అంతటి శక్తిసామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలు రాలేదు. స్వతహాగా ప్రజల్లోంచి వచ్చిన నాయకులకే అలాంటి లక్షణాలు అబ్బుతాయి. తండ్రిచాటు బిడ్డగా ఎదిగిన లోకేష్ ను ఇప్పుడు భావి టీడీపీ నాయకుడిగా ఒప్పుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేదు. అయితే లోకేష్ అందరూ వాడిన బ్రహ్మాస్త్రంతో టీడీపీని గద్దెనెక్కించాలని యోచిస్తున్నాడు. అది ఎంతవరకు ఫలిస్తుందనేది వేచిచూడాలి..
పాదయాత్ర.. తెలుగునేలపై పవర్ ఫుల్ యాత్ర. రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసే యాత్ర. అందుకే ఈ పాదయాత్ర చేసిన నాయకులను ప్రజలు అందలమెక్కించారు. ఆ తదనంతర కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రులను చేశారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్.. అంతా ఒకేబాటలో నడిచారు. అనంతరం అధికారాన్ని అధిరోహించారు.
ఇప్పుడు జగన్ పాదయాత్రతో కొల్లగొట్టిన అధికారాన్ని అదే అస్త్రంతో టీడీపీని గద్దెనెక్కించాలని మొదలు పెట్టబోతున్నారట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైన పార్టీకి జవసత్త్వాలు నింపేందుకు.. తన నాయకత్వంపై వస్తున్న విమర్శలకు జవాబు చెప్పేందుకు.. నాయకత్వ పటిమను నిరూపించుకునేందుకు ఇప్పుడు లోకేష్ ఎంచుకుంటున్న ఆయుధం పాదయాత్రేనన్న చర్చ టీడీపీలో సాగుతోంది...
టీడీపీ కుదేలైంది. వైసీపీ కొట్టిన దెబ్బకు కోలుకోవడం లేదు. మరోవైపు ప్రత్యర్థులంతా కాచుకూర్చున్నారు. బీజేపీ అయితే చంద్రబాబును నిర్వీర్యం చేసి టీడీపీని హైజాక్ చేయాలని చూస్తోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలను లాగేసింది. పార్టీ మారిన వారంతా అంతా లోకేష్ చేశాడంటున్నారు. ఇక లోకేష్ పై నమ్మకం లేదని.. జూనియర్ ఎన్టీఆర్ రావాలని కొందరంటున్నారు. ఇక టీడీపీ గడ్డు పరిస్థితుల్లో ఉందని.. బాలక్రిష్ణ సినిమాలు వదిలి ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రావాలని తెలుగుతమ్ముళ్లు కోరుతున్నారు.
లోకేష్ బాబు భాషపటిమ, శక్తిసామర్థ్యాలను తెలుగు ప్రజలందరూ వీడియోల్లో కల్లారా చూశారు. టీచర్ ను పెట్టి మరీ చంద్రబాబు కోచింగ్ ఇప్పించినా లోకేష్ బాబు పలుకులు తడబడ్డ తీరును నెటిజన్లు ఎండగట్టారు. కనీసం సొంతంగా ఎమ్మెల్యేగా గెలవలేని స్థితిలో లోకేష్ బాబు ఉన్నాడని పోయిన ఎన్నికలతో నిరూపితమైంది.. నాయకత్వ సామర్థ్యాలు మచ్చుకైనా లేని లోకేష్ ను టీడీపీ నేతలు, కార్యకర్తలు భరించే స్థితిలో లేరని పార్టీ వీడిన వారి మాటలను బట్టి అర్థమవు తోంది. ఇప్పటికే పప్పు నామధ్యేయంతో లోకేష్ అభాసుపాలయ్యారు. సోషల్ మీడియాలో లోకేష్ అసమర్థతపై పేలిన మీమ్స్, సెటైర్లు అన్నీ ఇన్నీ కావు.. అలాంటి లోకేష్ పాదయాత్ర చేసినా.. మోకాళ్లతో నడిచినా తెలుగు జనాల్లో పాపులారిటీ రావడం కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. తండ్రి చాటు బిడ్డగా ఎదిగిన లోకేష్ ను అసలు టీడీపీ వాళ్లే యాక్సెప్ట్ చేయడం లేదట.. ఇక జనాల సంగతి చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. మరి వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్ ల మాదిరిగా లోకేష్ పాదయాత్ర చేసినా నిష్ప్రయోజనం తప్పితే పార్టీకి పెద్దగా లాభం ఉండదన్నది పొలిటికల్ విశ్లేషకుల భావన..