Begin typing your search above and press return to search.

వైసీపీని తొక్కేస్తాను అంటున్న చినబాబు... ?

By:  Tupaki Desk   |   5 Nov 2021 2:57 AM GMT
వైసీపీని తొక్కేస్తాను అంటున్న చినబాబు... ?
X
వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడించడం టీడీపీ ముందున్న బిగ్ టాస్క్. ఇప్పటికి సగం పాలన గడిచిపోయింది. వైసీపీకి ఎంత ప్రజా వ్యతిరేకత వచ్చింది అన్నది పక్కన పెడితే టీడీపీ ఒక ప్రధాన విపక్షంగా జనంలో తగిన పొలిటికల్ మైలేజ్ ని సాధించిందా. ఆ పార్టీ చేస్తున్న పోరాటాలకు జనం మద్దతు లభిస్తోందా అంటే జవాబు నిరాశగానే వస్తోంది. పైగా రెండున్నరేళ్లలో గట్టిగా పోరాటం చేసిన సందర్భం కూడా టీడీపీకి లేదు అంటారు. ఏపీ మొత్తం చూసేలా జనం ఆ పార్టీ వైపు ఫోకస్ అయ్యేలా టీడీపీ చేసిన భారీ ఉద్యమాలు అయితే లేవు అనే అంటారు. మరి ఇంటర్వల్ దాటిన వైసీపీ పాలనకు శుభం కార్డు వేయాలీ అంటే టీడీపీ ఇప్పటి నుంచీ గట్టిగానే ఫీల్డ్ లోకి దిగాలి. అయితే అవుట్ డేటెడ్ విధానాలతో జనాలను అట్రాక్ట్ చేయడం కుదరదు. అలాగే రొడ్డ కొట్టుడు డైలాగులూ రొటీన్ ప్రసంగాలతో కూడా జనాలను ఆకట్టుకోవడం కష్టమే. అందుకే టీడీపీ థింక్ టాంక్ ఇపుడు వినూత్న ఆలోచనలు చేస్తోందిట.

అందులో భాగమే చినబాబు లోకేష్ ని మరింతగా యాక్టివ్ చేస్తూ జనాల్లోకి పంపించడం. టీడీపీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ మీద ఏపీ అంతటా దాదాపు ఏడాది పాటు చినబాబు సవారీ చేయడం అన్నది ఇపుడు టీడీపీ ఎంచుకున్న బ్రహ్మాస్త్రం అంటున్నారు. పాదయాత్ర అంటే జనాలకు షరా మామూలు అయిపోయింది. ఇప్పటికే చాలా మంది నేతలు చేసేసి ఉన్నారు. దానికి తోడు అది బహు కష్టంతో కూడుకున్న వ్యవహారం. అందువల్ల లోకేష్ సైకిల్ యాత్రను ఎంచుకున్నారని అంటున్నారు. లోకేష్ ఏపీ అంతటా సైకిల్ తొక్కుతూ అధికార వైసీపీని ఒక తొక్కు తొక్కేసేలా మొత్తం యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసి పెట్టారుట.

చిత్రంగా ఈ సైకిల్ యాత్రను కూడా అచ్చొచ్చిన ఉత్తరాంధ్రా జిల్లాల నుంచే మొదలెడతారు అంతున్నారు. శ్రీకాకుళం నుంచి లోకేష్ సైకిల్ యాత్ర ప్రారంభమై ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అంటే లోకేష్ సిక్కోలులో సైకిలెక్కితే దిగేది మాత్రం జగన్ ఇలాకలో అన్న మాట. ఇక ఈ సైకిల్ యాత్రలో కూడా అనేక చోట్ల సభలు, సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే అధికార వైసీపీ పాలనను విమర్శిస్తూ లోకేష్ ప్రజా మద్దతు కూడగడతారు. అదే విధంగా లోకేష్ కి టీడీపీలో మరింత ఆదరణ దక్కేలా తన నాయకత్వానికి తిరుగు లేకుండా చేసుకునేలా ఈ సైకిల్ యాత్ర దోహదపడుతుంది అంటున్నారు. మొత్తానికి సైకిల్ యాత్రతో వైసీపీని కిల్ చేస్తానని చినబాబు గట్టి శపధమే చేస్తున్నారు. ఇంతకీ ఈ యాత్ర మొదలయ్యేది ఎపుడంటే 2022 మార్చి తరువాతనట. అంటే ఆ ముహూర్తాన్ని రెడీ చేసుకుని ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు అనుకోవాలి.