Begin typing your search above and press return to search.
ప్రజల ప్రైవసీపై కత్తి దూస్తున్న లోకేశ్?
By: Tupaki Desk | 15 July 2018 7:09 AM GMTఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏపీలో ఉన్నా దేశంలో ఇంకెక్కడున్నా కూడా దాదాపుగా వారికి ప్రతి రోజూ ఒక నస తప్పడం లేదు. పొద్దున్న లేచాక ఉదయం 9 గంటల్లోగా తప్పకుండా ఫోన్ రింగవుతుంది. లిఫ్ట్ చేస్తే చాలు.. నేను - మీ చంద్రబాబునాయుడిని అంటూ ఏపీ సీఎం వాయిస్ తో సర్వే కాల్ వినిపిస్తుంది. బాగుందనో.. బాగులేదనో ఏదో ఒకటి చెప్పాక కూడా రోజులో రెండుమూడు సార్లు మళ్లమళ్లీ అదే కాల్ వస్తుంది. అది కూడా ఒక్క రోజుతో అయిపోదు.. మళ్లీ మరుసటి రోజు.. ఆ తరువాతి రోజు.. ఇలా ప్రతి రోజూ రోజుకు రెండుమూడు సార్లు ఈ కాల్ గ్యారంటీగా వస్తోందంటున్నారు ప్రజలు. తమ పనులకు ఇబ్బంది కలిగిస్తోందని - ప్రైవసీని దెబ్బతీస్తోందని అంటున్నారు. అంతేకాదు.. ఆ నంబరును గుర్తించి ఫోన్ కట్ చేసినా - లిఫ్ట్ చేయకుండా వదిలేసినా మళ్లీ వెంటవెంటనే పదేపదే కాల్ వస్తోందని అంటున్నారు. కేవలం ఏపీలో ఉన్నవారికే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు వారికీ ఈ నస తప్పడం లేదట. దీంతో కొందరు.. ఆ సర్వీస్ కు చెందిన వారితో మాట్లాడేందుకు గాను తొలుత ప్రభుత్వ పనితీరు నచ్చడం లేదని చెబుతున్నారు.. ఎందుకు నచ్చడం లేదో తమ కాల్ సెంటర్ పర్సన్ కు చెప్పాలంటూ ఆప్షన్ వస్తోంది.. అది నొక్కగానే కాల్ సెంటర్ పర్సన్ కాంటాక్టు అవుతున్నారు.. వారితో.. తాము ఏపీలో లేమని.. మళ్లీ మళ్లీ తమకు ఫోన్ చేసి విసిగించొద్దని చెబుతున్నా కూడా పరిస్థితి మారడం లేదని ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు వాపోతున్నారు.
చంద్రబాబునాయుడు దెబ్బకు దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ప్రతిరోజూ ఇలా ఇబ్బంది పెడుతోంటే.. అది చాలదన్నట్లుగా తండ్రికి తగ్గ తనయుడు నారా లోకేశ్ కూడా ప్రజల ప్రైవసీపై దాడికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియా హబ్ పేరుతో ఒకటి ఏర్పాటు చేసి కోట్ల ఖర్చుతో పార్టీ ప్రచారానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వాట్సాప్ గ్రూపులు - ఫేస్ బుక్ మెసేంజర్ ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున సందేశాలు పంపుతారట. ఫేస్ బుక్ - ట్విటర్లో ఇప్పటికే రకరకాల పేర్లుతో టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది.
మరోవైపు లోకేశ్ సూచనలతో ముమ్మరంగా సాగుతున్న సోషల్ హబ్ యాక్టివిటీకి ప్రభుత్వ నిధులను మళ్లిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. పార్టీ ప్రచారం - నేతల ప్రచారం కోసం చేస్తున్న పనికి ప్రభుత్వ నిధులు - ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది. అంతేకాదు.. ప్రజల ప్రైవసీకి భంగం కలిగించే చర్యలకు దిగడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.