Begin typing your search above and press return to search.
బాబు మాటనే కాపీ కొట్టేస్తున్న లోకేష్
By: Tupaki Desk | 12 May 2017 3:41 PM GMT`ప్రపంచం అంతా తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఐటీ హబ్ గా మార్చాను. సైబరాబాద్ డెవలప్ మెంట్ నా చలవే. ఏ టెక్ ప్రముఖుడు అయినా నన్నే గుర్తు చేస్తుంటారు. ఇవి సాధారణంగా ఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఐటీ ప్రస్తావన రాగానే చేసే కామెంట్లు. ఇవే కామెంట్లను ఆయన తనయుడు నారా లోకేష్ కూడా పునరుద్ఘాటించారు. మంత్రిగా పదవీ బాధ్యతలు వస్వీకరించిన అనంతరం తొలిసారిగా ఢిల్లీలో పర్యటించిన లోకేష్....ప్రముఖ ఐటీ సేవల సంస్థల హెచ్ సీఎల్ ఛైర్మన్ శివనాడార్ ను కలిశారు. నాడార్ తో సమావేశం అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి - సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు.
చంద్రబాబు ఎప్పుడు కలిసినా ఐటీ అభివృద్ధి గురించే మాట్లాడేవారని హెచ్ సీఎల్ చైర్మన్ శివనాడార్ గుర్తు చేసుకున్నారని లోకేష్ చెప్పారు. ఐటీ అభివృద్ధికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో దోహదం చేస్తున్నారని శివనాడార్ అన్నారని లోకేష్ మీడియాకు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేష్ అన్నారు. అమరావతిలో ఐటీ అభివృద్ధిపై హెచ్ సీఎల్ చైర్మన్ శివనాడార్ కు వివరించినట్లు మంత్రి నారా లోకేష్ మీడియాకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను లోకేష్ ఈ సందర్భంగా వివరించారు. ప్రభుత్వ రాయితీలు, సింగిల్ విండో విధానంలో అనుమతులపై వివరించినట్లు లోకేష్ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/