Begin typing your search above and press return to search.
పేదరాలి దాతృత్వం ఓకే...మరి నారా వారి దానమెక్కడో?
By: Tupaki Desk | 15 April 2020 3:01 PM GMTనిజమే... టీడీపీ ప్రభుత్వం కుప్పకూలిపోయాక కేవలం ట్విట్టర్ కు మాత్రమే పరిమితమైపోయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి - ఏపీ మాజీ మంత్రి - ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఎప్పుడు ఏ అంశాన్ని ప్రస్తావించినా... ఓ మంచిని ఓ వేలు చూపుతుంటే.. మిగిలిన నాలుగు వేళ్లు తనవైపే చూపిస్తున్నాయన్న మాటకు సార్థకత తీసుకొచ్చేలానే కనిపిస్తున్నారు. ఇప్పటికే అటు విపక్షాలతో పాటు ఇటు ప్రజలకు అడ్డంగా బుక్కై ఓ రేంజిలో ట్రోలింగ్ కు గురవుతున్న లోకేశ్.. తాజాగా కరోనా వేళ ప్రజలకు అలుపెరగని సేవ చేస్తున్న పోలీసులు, ఇతర వర్గాల వారికి సామాన్య జనం నుంచి వెల్లువెత్తుతున్న ఔదార్యాన్ని ప్రస్తావించిన లోకేశ్.. ఔదార్యం అనే మాటను పలికే అర్హత అస్సలు లోకేశ్ కే లేదన్న మాటను తనపైన వేసుకున్నారని చెప్పక తప్పదు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... కరోనా కట్టడికి అహోరాత్రులు పోలీసులు విధులు నిర్వహిస్తూ నిబంధనలు అమలయ్యేలా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ పోలీసులకు కూల్ డ్రింకు బాటిళ్లు ఇస్తుండగా తీసిన వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన లోకేశ్ ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ వీడియోలో ఏముందంటే... లాక్ డౌన్ విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు ఓ మహిళ కూల్ డ్రింకుల సీసాలు అందించింది. మొదట ఫాంటా బాటిల్ ను ఆమె పోలీసులకు ఇచ్చింది. అనంతరం ఫాంటా బాటిల్ తో పాటు థమ్సప్ బాటిల్ ను కూడా తీసి ఇవ్వబోయింది. అప్పుడు 'నీ జీతం ఎంత?' అని ఆమెను పోలీసులు అడిగారు. దానికి ఆమె 3,500 రూపాయలు అని చెప్పింది. అంత తక్కువ జీతం పొందుతోన్న ఆమె తమకు సేవ చేయాలనుకోవడంపై పోలీసులు ప్రశంసలు కురిపించారు. ఆమెది చాలా పెద్ద మనసు అని అన్నారు. చివరకు వాటిని పోలీసులు తీసుకోలేదు.
ఈ వీడియో తనను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకొచ్చిన లోకేశ్.. సదరు వీడియోకు 'లాక్ డౌన్ నేపథ్యంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన ఈ దృశ్యాలు మానవత్వంపై మనలో తిరిగి నమ్మకాన్ని నింపేలా ఉన్నాయి. ఆమె ఇస్తున్న స్ఫూర్తిని అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన చిరునవ్వులు చిందిస్తూ ఆమె పోలీసులకు వాటిని అందించాలనుకుంది' అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. లోకేశ్ చేసిన ఈ ట్వీట్ చూడంగానే జనానికి లోకేశ్ - ఆయన కుటుంబం కరోనా కట్టడికి చేసిన సాయమెంత అన్న వివరాలు గుర్తుకు వచ్చాయి. కోట్లాది రూపాయల లాభాలను ఆర్జిస్తున్న హెరిటేజ్ కంపెనీ ఉన్నా... లక్షల్లోనే విరాళం ఇచ్చేసి చేతులు దులుపుకున్న లోకేశ్ ఫ్యామిలీ... అసలు కరోనా మహమ్మారి ఏపీలోకి ఎంట్రీ ఇచ్చినంతనే హైదరాబాద్ పరారైన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్న జనం... లోకేశ్ తాజా ట్వీట్ పై మాత్రం తమదైన రేంజిలో పంచ్ లు వేస్తున్నారు.