Begin typing your search above and press return to search.
పేర్లు మార్చి.. కొత్త స్టిక్కర్లు వేసి జగన్ మైలేజీ జేబులో వేసుకున్నారా?
By: Tupaki Desk | 9 Jun 2020 4:45 AM GMTరాజకీయాలన్నాక విమర్శలు.. ఆరోపణలు మామూలే. కాకుంటే.. వర్తమానాన్ని ప్రశ్నించే వేళ.. గతం గుర్తుకు వచ్చేలా వాదన ఉండకూడదు. ఈ లాజిక్ మిస్ అయితే.. విమర్శలతో వచ్చే మైలేజీ తర్వాత.. ఉన్న ఇమేజ్ పోవటం ఖాయం. ఇప్పుడు అలాంటి తప్పే చేస్తున్నారా చినబాబు అన్నది ప్రశ్నగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన పథకాలను తప్పు పడుతూ లోకేశ్ చేసిన పదునైన విమర్శలు.. ఆరోపణలు అందరిని ఆకర్షిస్తున్నాయి.
గతానికి భిన్నంగా తన మాటల్లో చురుకుదనం పెంచిన లోకేశ్.. లాజిక్ కూడా తప్పకూడదన్న విషయాన్ని మరిచినట్లుగా కనిపిస్తోంది. గతంలో మీడియాతో మాట్లాడే సమయంలో చినబాబులో తడబాబు కొట్టొచ్చినట్లుగా కనిపించేది. అందుకు భిన్నంగా లోకేశ్ తీరు మారింది. అయితే.. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాల్ని సంధించే వేళలో.. అవేమీ సెల్ఫ్ గోల్ గా మారకూడదన్న విషయంలో మాత్రం చినబాబు తప్పులో కాలేసినట్లుగా చెబుతున్నారు.
జగన్ ప్రభుత్వ కొలువు తీరిన తర్వాత తమ హయాంలో తీసుకొచ్చిన పథకాల పేర్లు మార్చి.. కొత్త స్టిక్కర్లు వేశారంటూ మండిపడుతున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ .. వైఎస్సార్ పెన్షన్ కానుక అయ్యిందని.. చంద్రన్న పెళ్లి కానుక వైఎస్సార్ పెళ్లి కానుకగా మారిందన్నారు. బడి పిలుస్తోంది కాస్తా రాజన్న బడిబాటగా మారిందని.. అన్నదాత సుఖీభవన పథకం రైతుభరోసా పథకంగా మారిందన్నారు.
నాలుగో సింహం యాప్.. దిశ యాప్ గా మారిందన్న లోకేశ్.. ఆటో కార్మికులకు పథకాలు అమలు కావాలంటే ఆటోలపై జగన్ స్టిక్కర్ వేయాలని ఆంక్షలు పెడుతున్నారన్న చినబాబు..తమ ప్రభుత్వ హయాంలోనూ పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టిన వైనాన్ని ఎందుకు మర్చిపోతున్నట్లు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన పలు పథకాలకు.. తమకు నచ్చిన పేర్లు పెట్టేసి.. ఆ పథకాల్ని తాము అమలు చేస్తున్నట్లు చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చేలా చినబాబు మాటలు ఉండటం ఎవరికి నష్టం? గతానికి మించి తన విమర్శల్లో పదును పెంచిన లోకేశ్.. లాజిక్ మిస్ కాకుండా మాట్లాడితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.