Begin typing your search above and press return to search.

గుంటూరు అర్బన్ ఎస్పీపై నారా లోకేష్ ప్రివిలేష్ నోటీసు

By:  Tupaki Desk   |   1 Dec 2020 12:40 PM GMT
గుంటూరు అర్బన్ ఎస్పీపై నారా లోకేష్ ప్రివిలేష్ నోటీసు
X
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తాజాగా గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా అమ్మిరెడ్డి తనను బెదిరించాడని.. శాసన మండలి చైర్మన్ కు లోకేష్ ఫిర్యాదు చేశారు.

టీడీపీ కార్యకర్త మణిరత్నం అక్రమ అరెస్ట్ ను తాను తప్పుపడితే తన హక్కులకు భంగం కలిగించేలా ట్విట్టర్ లో అమ్మిరెడ్డి తనను ఉద్దేశించి పోస్టింగులు పెట్టారని సభా హక్కుల ఉల్లంఘన నోటీసులో లోకేష్ ప్రస్తావించారు. తన హక్కులకు భంగం కలిగించిన గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ ను కోరారు.

నారా లోకేష్ బుధవారం ఓ ట్వీట్ చేశారు. ఓ ప్రహరీ గోడ ప్రారంభోత్సవానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ కార్యకర్త మణిరత్నం పోస్ట్ పెడితే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఆ వీడియోలను ట్వీట్ చేశారు. టీడీపీ కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. వైసీపీ నేతలు ఆడమన్నట్టు పోలీసులు ఆడుతూ అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. గుంటూరు అర్బన్ ఎస్పీకి ధైర్యం ఉంటే పెదకాకాని పోలీస్ స్టేషన్ లో సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్త మణిరత్నం ఆ పోలీస్ స్టేషన్ వద్ద విడుదలైన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పోలీసులు రాజకీయ ఉన్నతాధికారులకు లొంగిపోవడం మానుకోవాలన్నారు.

పోలీసులపై లోకేష్ వ్యాఖ్యలకు గుంటూరు ఎస్పీ కౌంటర్ ఇచ్చాడు. హెచ్చరికలు జారీ చేశాడు. లోకేష్ ట్వీట్టర్ ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.కులపరంగా లోకేష్ రెచ్చగొట్టే విధంగా చూశారని మండిపడ్డారు.

దీనిపై సీరియస్ అయిన నారా లోకేష్ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసి సభా హక్కుల నోటీసు ఇచ్చారు.