Begin typing your search above and press return to search.

స్క్రిప్టు ఉంటేనే మాట్లాడుతా...లోకేష్‌!

By:  Tupaki Desk   |   10 July 2017 10:08 AM GMT
స్క్రిప్టు ఉంటేనే మాట్లాడుతా...లోకేష్‌!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. విజయవాడ ఆటోనగర్‌ లో ఏడు ఐటీ కంపెనీలను సోమ‌వారం లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగాల అనంతరం లోకేష్‌ మీడియాతో మాట్లాడారు. గుంటూరులో జ‌రిగిన‌ వైకాపా జాతీయ‌ ప్లీనరీలో చేసిన విమర్శల గురించి విలేక‌రులు ప్ర‌శ్నించ‌బోయారు. దానికి లోకేష్‌..."హలో, సచివాలయంలో మాట్లాడదాం. ప్లీజ్... ఇక్కడ స్క్రిప్టు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే" అన్నారు.

ఎక్క‌డి స్క్రిప్ట్ అక్క‌డే అన్న విధంగా లోకేష్ ఇచ్చిన స‌మాధానంపై ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఇటీవ‌ల లోకేష్ ప్ర‌సంగాల్లో ప‌దే ప‌దే త‌ప్పులు దొర్లుతుండ‌డంతో ఆయ‌న మీడియాతో మాట్లాడేట‌పుడు ఆచితూచి స‌మాధానమిస్తున్న‌ట్లు స‌మాచారం. ప‌క్కా స్క్రిప్టు ఉంటేనే త‌ప్పులు దొర్లుతున్న నేప‌థ్యంలోనే ఈ కార్య‌క్ర‌మంలో విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు లోకేష్ స‌మాధాన‌మివ్వ‌లేదని వినికిడి.

అంత‌కు ముందు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన లోకేష్ ఏడు ఐటీ కంపెనీల ద్వారా 300 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. సింగిల్‌ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని చెప్పారు. కంపెనీలను ఆహ్వానించేందుకు టెక్నాలజీ, ఫైనాన్షియల్‌ పాలసీ తెచ్చామని, ఇప్పటి వరకు 36 ఐటీ కంపెనీలను ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. 3684 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, రెండు నెలల్లో 15వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, చిన్న కంపెనీలను ప్రోత్సహిస్తే పెద్ద కంపెనీలుగా మారుతాయని చెప్పారు.