Begin typing your search above and press return to search.
తనను పప్పు అనొద్దని గూగుల్ కు లోకేశ్ విజ్ఞప్తి?
By: Tupaki Desk | 22 Feb 2020 9:15 AM GMTతెలుగు వారి సంప్రదాయ వంటకం.. రోజు తినే ఆహారంలో ప్రధానంగా పప్పు ఉంటుంది. అలాంటి ధాన్యం పేరు కొందరి వ్యక్తులకు స్థిరపడిపోయింది. ఆ ధాన్యం పేరు చెప్పగానే ఆంధ్రప్రదేశ్ లో ఒకరు - జాతీయ రాజకీయాల్లో ఒకరు గుర్తుకు వస్తుంటారు. ఆ విధంగా పేరు వారికి స్థిరపడిపోయింది. చివరకు గూగుల్ లో కొడితే ఆ పేరు వస్తుండడంతో వారికి రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీన్ని ప్రత్యర్థి పార్టీలు ఆసరాగా చేస్తూ వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఆ పదం వారికి ఇబ్బందిగా మారింది. దీంతో పదంపై చర్యలు తీసుకోవాలని గూగుల్ సంస్థను ఏపీకి చెందిన ఓ రాజకీయ నాయకుడు కోరినట్లు తెలుస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేశ్ గూగుల్ కు పప్పు అనే పదం తొలగించాలని కోరినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పప్పు అని కొడితే తన పేరు - ఫొటోలు రావడంతో కొంత అసహనానికి గురయ్యారు. గతంలో దీనిపై లోకేశ్ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో తనకు ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో గూగుల్ సెర్చ్ ఇంజన్ లో వాటిని తొలగించాలని కోరారంట. సెర్చ్ నిపుణులతో సమావేశమై పప్పు అంటే తన ఫొటోలు - పేరు రాకుండా చర్యలు చేపట్టాలని గూగుల్ కంపెనీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. గూగుల్ లో తెలుగు పప్పు - ఆంధ్రప్రదేశ్ పప్పు - ఏపీ పప్పు చివరకు పప్పు అని టైప్ చేసినా తన పేరు - ఫొటోలు వస్తుండడంతో ఈ మేరకు గూగుల్ కు ఆయన ఫిర్యాదు చేసినట్లు వార్త వినిపిస్తోంది. మరి అది ఎంతవరకు వాస్తవమో తెలియడం లేదు.