Begin typing your search above and press return to search.

ఆ రెండింటిలో ఏదో తేల్చాల‌న్న చిన‌బాబు!

By:  Tupaki Desk   |   3 May 2017 6:38 AM GMT
ఆ రెండింటిలో ఏదో తేల్చాల‌న్న చిన‌బాబు!
X
ఏపీ రాజ‌కీయాల్లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు క‌మ్ మంత్రి నారా లోకేశ్ ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లోకి వ‌స్తున్నారు. మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కొత్త‌ల్లో కాబ‌ట్టి మీడియా అటెన్ష‌న్ కాస్త ఎక్కువే ఉంటుంది. అదే స‌మ‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశాలుగా మార‌టమే కాదు.. ఎప్పుడూ లేని విధంగా చిన్న చిన్న అంశాల విష‌యంలోనూ ఆయ‌న మాట‌ల్లో త‌ప్పులు దొర్ల‌టం ప్ర‌తిప‌క్షానికి ఇదో అస్త్రంగా మారింది.

ఇప్పుడున్న దూకుడు రాజ‌కీయాల నేప‌థ్యంలో.. ప్ర‌త్య‌ర్థుల‌పై స‌రికొత్త‌గా విరుచుకుప‌డే వైనానికి త‌గ్గ‌ట్లే లోకేశ్ మీద కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్య‌మంత్రి కుమారుడు కావ‌టం.. మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నేప‌థ్యంలో చిన‌బాబుపై వ‌చ్చిన విమ‌ర్శ‌లు మీడియాలో కాస్త ఎక్కువ‌గా ఫోక‌స్ కావ‌టం.. అదే విష‌యాన్ని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు త‌ర‌చూ ప్ర‌స్తావించ‌టం ద్వారా అధికార‌ప‌క్షాన్ని ఇరిటేట్ చేయాల‌న్న వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు.

అయితే.. ఇలాంటి ప‌రిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాల‌న్న విష‌యంలో లోకేశ్ తో స‌హా ఎవ‌రికీ పెద్ద‌గా ఐడియా లేద‌న్న విష‌యం తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. త‌న మీద వ‌స్తున్న విమ‌ర్శ‌ల విష‌యంలో పంచ్ ప‌డేలా రియాక్ట్ కావాల్సిన లోకేశ్‌.. స‌రైన హోం వ‌ర్క్ చేయ‌కుండా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడాయ‌న్ను మ‌రింత న‌వ్వుల‌పాలు చేసేలా ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ప్ర‌తిపక్షాలు త‌న‌ను ప‌ప్పు.. అవినీతిప‌రుడ‌ని విమ‌ర్శిస్తున్నాయ‌ని.. ఇందులో తాను ఏదో తేల్చి చెప్పాలంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. రెండు వేర్వేరు విమ‌ర్శ‌ల్లో ఏదో ఒక‌టే తేల్చాల‌ని చెప్ప‌టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ప‌ప్పుగా ఉన్న వ్య‌క్తి అవినీతి చేయ‌లేరా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. త‌న‌పై ఎంత దుష్ర్ప‌చారం చేసినా తాను మాత్రం ప‌ని చేసి చూపిస్తాన‌ని చెబుతున్నారు. నిజ‌మే.. ప‌నితో త‌న‌పై విమ‌ర్శ‌లు చేసే వారి నోరు మూయించొచ్చు. కానీ.. అంత‌కు ముందు.. తాను నోరు విప్పి మాట్లాడే మాటల్లో త‌ప్పులు దొర్ల‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త లోకేశ్ మీద ఉంద‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తిస్తే మ‌రింత బాగుంటుంది. ఏదైనా విష‌యం మీద మాట్లాడేట‌ప్పుడు ఆ విష‌యం మీద ఒక‌టికి నాలుగుసార్లు పున‌శ్చ‌ర‌ణ చేసుకొని మాట్లాడితే బాగుంటుంద‌న్న సూచ‌న‌ను ప‌లువురు చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/