Begin typing your search above and press return to search.
లోకేశ్ ఖర్చు ఎంపీ అభ్యర్థి భరించాలా?
By: Tupaki Desk | 23 March 2019 8:09 AM GMTఇప్పుడున్న మీడియాలో సుద్దపూసలు ఎవరూ లేరని గట్టిగా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అఫిలియేషన్ ఉందన్న విషయం ఓపెన్ గా తెలిసిన విషయమే. ఎవరికి వారు.. వాళ్ల వారికి మద్దతుగా ఇచ్చే కథనాల్ని అచ్చేయటం ఈ మధ్యన కామన్ అయ్యింది. కాస్తో కూస్తో న్యూట్రల్ గా ఉన్న మీడియా సంస్థలు సైతం ఏదో పార్టీకి ఫేవర్ గా ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నవే.
ఇలాంటి వేళ.. బాబుకు అత్యంత సన్నిహితంగా ఉండటమే కాదు.. బాబు డిసైడ్ చేసిన అభ్యర్థుల్లో కొందరి ఎంపిక రెండు ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన వారి జోక్యం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. అలాంటి మీడియా సంస్థలో బాబుకు బ్యాచ్ కు చెందిన ఒక కథనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
గుంటూరు ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ మీద ఒక కథనం వచ్చింది. అందులో గుంటూరు పార్లమెంటు పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థులకు అయ్యే ఖర్చుల కోసం జయదేవ్ మీద ఆధారపడుతున్నట్లుగా పేర్కొన్నారు.
ఎన్నికల ఖర్చు పెట్టుకునే స్థితిలో తాము లేమని.. సదరు నలుగురు అసెంబ్లీ అభ్యర్థులు గల్లాకు చెప్పారని.. తమ మొత్తం ఖర్చును గల్లా భరించాలని వారు వాపోయినట్లుగా పేర్కొన్నారు. టికెట్లు కోరేటప్పుడు చాలానే మాటలు చెప్పి.. తీరా బీఫారాలు చేతికి అందిన తర్వాత తెలుగు తమ్ముళ్లు ప్లేట్లు తిప్పేస్తున్న వైనంపై ఈ కథనాన్ని అచ్చేశారు. ఇందులో గల్లా మీద భారం పెరుగుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉన్నప్పుడు మిగిలిన ముగ్గురు అభ్యర్థులు కూడా గల్లా తమకు సాయం చేయకపోతారా? అన్న భావనలో ఉన్నట్లు రాశారు.
ఈ ముగ్గురుఅభ్యర్థుల్లో మంత్రి లోకేశ్ కూడా ఉండటం గమనార్హం. కథనం రాసిన రిపోర్టర్ తప్పుగా రాశారా? లేదంటే.. వాస్తవం కూడా అలానే ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎన్నికల ఖర్చుకు సంబంధించి గల్లా జయదేశ్ మీద రూ.350 కోట్ల ఆస్తులు ఉన్న లోకేశ్ కూడా గల్లా మీద ఆధారపడటం ఏమిటి? అన్నది ప్రశ్న అయితే.. ఇలాంటి కథనం బాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ.. ఆయన గెలుపు మీద కోటి ఆశలు పెట్టుకున్న మీడియా సంస్థలో అచ్చుకావటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.