Begin typing your search above and press return to search.
లోకేశ్ దగ్గర లవ్ మ్యాటర్ లేదట
By: Tupaki Desk | 20 March 2017 4:42 AM GMTబావా మరదళ్ల మధ్య ప్రేమ మ్యాటర్ చాలా కామన్. కానీ.. తమ మద్యన అలాంటివేమీ లేవని చెప్పారు టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి.. మరికొద్ది రోజుల్లో మంత్రి పదవిని చేపట్టనున్న చంద్రబాబు తనయుడు లోకేశ్. తనకు వరసైన బ్రాహ్మణిని వివాహమాడిన ఆయన.. తమ మధ్యన లవ్ మ్యాటర్ లాంటిదేమీ లేదన్న విషయాన్ని తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
బ్రాహ్మణితో పెళ్లి నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారు? ఎవరి ప్రపోజల్ తో ఈ ఇష్యూ తెర మీదకు వచ్చిందన్న విషయంపై లోకేశ్ పెదవి విప్పారు. చాలా చిన్న వయసులోనే (పెళ్లి నాటికి 24 ఏళ్లు) తమ వివాహం జరిగిందని.. అప్పట్లో తాము చదువుకునే వాళ్లమని.. బ్రాహ్మణితో పెళ్లి నిర్ణయన్ని తన తండ్రి చంద్రబాబే తీసుకున్నారని.. ఆయన ప్రపోజల్ తో ఈ విషయం తెర మీదకు వచ్చిందని చెప్పారు లోకేశ్.
తామిద్దరం చదువుకుంటున్న వేళ.. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన తన తండ్రి.. పెళ్లి తర్వాత కూడా చదువుకోవటానికి ఎలాంటి అభ్యంతరం ఉండదన్న విషయాన్ని బ్రాహ్మణికి చెప్పి.. ఆమెను ఒప్పించినట్లుగా లోకేశ్ వెళ్లడించారు. తన మాటలతో.. బ్రాహ్మణితో తన మ్యారేజ్ పూర్తిగా పెద్దల నిర్ణయంగా లోకేశ్ చెప్పేయటం కనిపిస్తుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/