Begin typing your search above and press return to search.
ఏపీలో బ్రేకింగ్ న్యూస్.. అవ్వ తాతల పెన్షన్ బంద్.. అది చేయకపోతే..
By: Tupaki Desk | 30 Nov 2021 4:30 PM GMTఇటీవలే 'అభయహస్తం' లబ్ధిదారుల రూ.2వేల కోట్లు డిపాజిట్ వెనక్కి తీసుకొని షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మరో పథకంలో లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తోందా? అంటే ఔననే అంటున్నారు టీడీపీ భావి వారసుడు నారా లోకేష్. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ దాన్ని తెగ ప్రచారం చేస్తోంది.
తాజాగా వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న గృహ నిర్మాణంలో ఓటీఎస్ పథకం ఆదేశాలు నిజమేనని నారా లోకేష్ అంటున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. గృహనిర్మాణంలో ఓటీఎస్ పథకం కింద రూ.10 వేలు కనుక చెల్లించకుంటే లబ్ధాదారులకు పెన్షన్ నిలిపివేయాలన్న ఆదేశాలు జారీ చేశారని ఒక అధికారి వలంటీర్లకు ఇచ్చిన ఆదేశాల ఫొటో వైరల్ అవుతోంది.
రూ.10 వేలు చెల్లించని లబ్ధిదారులు, కుటుంబ సభ్యులకు డిసెంబర్ పెన్షన్ నిలిపివేయాలని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు ఆ ఫొటోలో ఉంది. ఆదేశాలను ఉల్లంఘించిన వాలంటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఈ మొత్తం వసూలుకు వాలంటీర్లనే బాధ్యులను చేస్తామని ఆ ఆదేశాల్లో అధికారులు పేర్కొనడం గమనార్హం. కుటుంబ సభ్యుల పెన్షన్, రైస్ కార్డ్ నంబర్, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి, వాలంటీర్లు గాని ఉంటే వారి వివరాలు తీసుకోవాల్సిందిగా అందులో ఆదేశాలు జారీ చేసింది.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో వాలంటీర్లకు గ్రామ సచివాలయ సిబ్బంది ఆదేశాలు జారీ చేసినట్టుగా ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే ఇవి నిజమైన ఆదేశాలా? లేక నకిలీవా? నారా లోకేష్ పోస్టులో నిజమెంత? అన్నది తెలియాల్సి ఉంది.
ఈ గృహనిర్మాణ పథకంలో ఓటీఎస్ పథకం కింద రూ.10 వేలు చెల్లించని వారికి పెన్షన్ నిలుపుదల అనే వార్తలపై ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.