Begin typing your search above and press return to search.
అయ్యా లోకేశా..ఏంచేస్తున్నావో నీకు అర్థమౌతోందా!
By: Tupaki Desk | 31 Jan 2020 12:20 PM GMTమాజీ ముఖ్యమంత్రి గారి తనయుడు నారాలోకేష్ గారు ఏ క్షణంలో ఎవరిపై ఎటువంటి కామెంట్స్ చేస్తాడో ఆ పార్టీ నేతలకే కాదు కనీసం ఆయనకి కూడా తెలియదు. ఎందుకంటే లోకేష్ గారి వాక్చాతుర్యం అలాంటిది. ఒకసారి మైక్ తీసుకుంటే చినబాబుని ఆపడం ఎవరితరం కాదు. ఇలా చాలా సార్లు బుక్కైయ్యారు. అందుకే లోకేష్ బయట కంటే ట్విట్టెర్లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. ట్విట్టర్ వేదికగానే అయన ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తుంటారు. కానీ , అప్పుడప్పుడు ఆ విమర్శలు మళ్లీ లోకేష్ నే ఇబ్బందుల్లోకి నెడుతుంటాయి. తాజాగా మరోసారి లోకేష్ తన కామెంట్స్ తో నెటిజెన్స్ కి పనిచెప్పాడు. అసలేమైంది అంటే ....
గత కొన్ని రోజులుగా ఏపీలో మూడు రాజధానుల పై చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇది ప్రస్తుతం సెలెక్టెడ్ కమిటీ వద్దకి వెళ్లినా కూడా టీడీపీ - వైసీపీ మధ్య మాత్రం విమర్శల యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే , ఏపీకి మూడు రాజధానులను ప్రతిపాదించిన జీఎన్ రావు రిపోర్టును చిత్తుకాగితంతో పోల్చిన తెలుగుదేశం నేతలు ఇపుడు ఆదే రిపోర్టు ఆధారంగా ముఖ్యమంత్రి జగన్ పైనా - ఏపీ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ కోవలోకి టీడీపీ చిట్టినాయుడు నారా లోకేశ్ కూడా జతయ్యారు. జీఎన్ రావు రిపోర్టులో కోట్ చేసిన అంశాల ఆధారంగా జగన్ పై ఆరోపణలు చేస్తూ లోకేశ్ ట్విట్స్ చేసాడు.
విశాఖ నగరాన్ని - ఉత్తరాంధ్రని దెబ్బతీసింది జగన్ గారే. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు’’ ఇది తాజాగా నారా లోకేశ్ చేసిన ట్వీట్. ఈ ఆరోపణకు ఆధారంగా ఆయన తన ట్వీట్‌కు జీఎన్ రావు నివేదికాంశాన్ని జత పరిచారు. తల్లి ని ఓడించారనే ద్వేషంతో ఉత్తరాంద్ర నడ్డి విరిచేలా జీఎన్ రావు కమిటీతో విశాఖపై జగన్ మోహన్ రెడ్డి విషం కక్కారన్నది లోకేశ్ ఆరోపణ. తుఫాన్లు వస్తాయని, ఉప్పునీరు చొచ్చుకొస్తుందని, రక్షణ ఉండదని కుట్రపూరితంగా రిపోర్ట్ రాయించారని లోకేశ్ ఆరోపణలు సంధించారు.ఆ చెత్త రిపోర్ట్ వలన ఎవరూ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాకుండా చేసారన్నది లోకేశ్ కామెంట్. ఉత్తరాంధ్రకి కంపెనీలు రాకుండా,పెట్టుబడులు రాకుండా, యువతకి ఉద్యోగాలు రాకుండా చేసి జీఎన్ రావు కమిటీ రిపోర్ట్‌తో జగన్ గారు దారుణంగా దెబ్బతీశారని లోకేశ్ ఆరోపిస్తున్నారు
అయితే, జీఎన్ రావు నివేదికలోని పాజిటివ్ అంశాల ఆధారంగానే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తున్న జగన్ ను ఉత్తరాంధ్ర ద్రోహిగా లోకేశ్ ప్రస్తావించడాన్ని విచిత్రంగా చూస్తున్నారు నెటిజన్లు. ఒకవైపు విశాఖలో ఎగ్జిక్యూటివ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ… అదే స్వరంతో ఉత్తరాంధ్రకు ద్రోహం అనడం విచిత్రంగా ఉంది అంటూ టీడీపీ పై , చిట్టినాయుడు పై సెటైర్లు వేస్తున్నారు. అసలు సచివాలయమే విశాఖకు వస్తుంటే.. ఉత్తరాంధ్రకు ఉద్యోగాలు రావంటూ విమర్శించడమేంటని అందరూ చర్చించుకుంటున్నారు. విశాఖకు రాజధాని రాకుండా అభ్యంతరపెడుతూనే ప్రభుత్వంపై బురద జల్లడం ఏంటని వైసీపీ నేతలు టీడీపీ పై రివర్స్ ఎటాక్ ప్రారంభించారు.