Begin typing your search above and press return to search.
దొంగబ్బాయ్ అబద్ధాలాపేయ్: లోకేష్ సెటైర్లు
By: Tupaki Desk | 11 Sep 2015 9:03 AM GMTఏపీ ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ యువనేత లోకేష్ తన పదునైన పంచ్ లతో విరుచుకుపడ్డారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కందుకూరులో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ లో పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని ప్రారభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్యకర్తలే టీడీపీకి వెయ్యి ఏనుగుల బలం అని...దొంగబ్బాయిలా పేపరు, చానెల్ పెట్టుకుని అబద్ధాలు ప్రచారం చేయాల్సిన అవసరం మనకు లేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ పచ్చి అబద్ధాలాడేస్తున్నారని...టీడీపీ కార్యకర్తలు వాటిని తిప్పి కొట్టాలని లోకేష్ సూచించారు.
టీడీపీ అదికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు చెప్పిన హామీలన్నింటిని నెరవేరుస్తున్నారని...రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని లోకేష్ చెప్పారు. వైకాపా దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యతను టీడీపీ కార్యకర్తలే స్వీకరించాలని ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తలందరు ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని...ఈ తరగతుల్లో పార్టీకి సంబంధించిన విషయాలపై శిక్షణ ఇస్తామన్నారు.
టీడీపీ కార్యకర్తలందరు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ర్యాగింగ్ నిరోధానికి కూడా టీఎన్ ఎస్ ఎఫ్ కృషి చేస్తుందని లోకేష్ చెప్పారు. అలాగే తాను కన్వీనర్ గా ఉన్న కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా ఇప్పటికే 126 కుటుంబాలను ఆదుకున్నామని లోకేష్ చెప్పారు. ఈ శిక్షణా శిబిరానికి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల కార్యకర్తలు హాజరయ్యారు.