Begin typing your search above and press return to search.
లోకేశ్ బాబు షాక్ తిన్నారట!
By: Tupaki Desk | 28 Dec 2018 12:40 PM GMTప్రజలు ఓట్లేసి గెలిపించకుండా మంత్రి పదవులు దక్కొచ్చు... నాన్న అన్నీ సమకూర్చి పెడితే ముఖ్యమంత్రి పీఠమూ దొరకొచ్చు.. కానీ, రాజకీయాలను తట్టుకొనే శక్తి మాత్రం ఎక్కడా రెడీమేడ్‌గా దొరకదు. అందుకే రెడీమేడ్ నాయకులకు రాజకీయ షాక్ లు తగిలినప్పుడు పాపం తెగ కంగారొచ్చేస్తుంది. తాజాగా కేంద్రం విషయంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పరిస్థితీ అలాగే ఉందట.
లోకేశ్ గత మూడు రోజులుగా సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఏపీకి ఐటీ మంత్రిగా ఉన్న ఆయన అమరావతి - విశాఖపట్నాలను చూపించి విదేశీ సంస్థలను.. అక్కడి ఇండియన్ సంస్థల నుంచి పెట్టుబడులు తెచ్చుకునే ఓపెన్ గా కొంత - తెర వెనుక కొంత పనిచేస్తున్నారు. ఆ క్రమంలో విశాఖ ఉత్సవ్ గురించి అక్కడ తనను కలిసిన వారితో లోకేశ్ తెగ పబ్లిసిటీ చేస్తున్నారట. విశాఖపట్నంలో బిజినెస్ పొటెన్సియాలిటీ.. అక్కడ టూరిజం పొటెన్సియాలిటీ.. వంటివన్నీ అందరికీ తెగ పబ్లిసిటీ చేసుకుంటున్న తరుణంలోనే ఇక్కడ విశాఖ ఉత్సవ్ జరగుతోంది. అయితే... విశాఖ ఉత్సవ్ లో నిర్వహించాల్సిన కీలక ఘట్టం ఎయిర్ షో విషయంలో మాత్రం లోకేశ్ కు భారీ షాక్ తగిలింది. కేంద్రం ఎయిర్ షో రద్దు చేసుకోవడంతో లోకేశ్ హతాశుడయ్యారట.
విశాఖ ఉత్సవాలు ఈరోజు సాయంత్రం జరగాలి. ఇందుకోసం రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాట్లను పూర్తిచేసింది. అయితే ఈ వేడుకల్లో నిర్వహించే ఎయిర్ షోలో పాల్గొనేందుకు వచ్చిన వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన 90 మంది సిబ్బందిని రక్షణ శాఖ సడెన్ గా వెనక్కు పిలిపించింది. రిహార్సల్స్ పూర్తి అయ్యాక కేంద్రం ఇలా చేయడంతో ఏపీ ప్రభుత్వం - మరీ ముఖ్యంగా లోకేశ్ బాబు షాక్ తిన్నారట. అయితే.. కేంద్రం కావాలనే ఇలా చేసిందని చెబుతున్నారు.. కేంద్రం ఇచ్చిన డబ్బుతో పథకాలు అమలు చేస్తూ.. కేంద్రం వనరులతో సోకులు పోతూ తిరిగి కేంద్రంపై విమర్శలు చేస్తుండడంతో ఇలా చేసినట్లు చెబుతున్నారు.