Begin typing your search above and press return to search.

బాబు స్పీడ్‌ తో పోటీ ప‌డ‌లేక‌పోతున్నాడ‌ట‌

By:  Tupaki Desk   |   29 May 2017 10:42 AM GMT
బాబు స్పీడ్‌ తో పోటీ ప‌డ‌లేక‌పోతున్నాడ‌ట‌
X
విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న టీడీపీ మ‌హానాడులో ఏపీ మంత్రి లోకేశ్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. యువ‌కుడినైన తాను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వేగంతో తాను పోటీ ప‌డ‌లేకపోతున్నాన‌ని చెప్పారు. విశాఖ‌ను ఐటీ హ‌బ్ గా తీర్చిదిద్దే బాధ్య‌త‌ను తాను తీసుకుంటున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు.

అనంత‌పురం జిల్లాకు కియో కార్ల ప‌రిశ్ర‌మ‌ను తీసుకొచ్చిన ఘ‌న‌త త‌న తండ్రిదేన‌న్న లోకేశ్‌.. త‌న తండ్రికి ఓపిక ఎక్కువ‌న్నారు. ఒక గంట ఆల‌స్య‌మైనా.. వెయిట్ చేసి మ‌రీ హెచ్‌ సీఎల్‌ తో ఎంవోయూ చేసుకున్నార‌ని చెప్పారు. రాష్ట్రానికి రూ.1.35ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు తీసుకొచ్చి 2.5లోల మందికి ఉద్యోగాలు క‌ల్పించిన ఘ‌న‌త ఏపీ ముఖ్య‌మంత్రికి చెందుతున్న ఆయ‌న‌.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల సంక్షేమం కోసం పార్టీ పెద్ద ఎత్తున ఖ‌ర్చు చేస్తుంద‌న్నారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల కోసం రూ.42.92కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని.. కార్య‌క‌ర్త‌ల పిల్ల కోసం రూ.10కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌న్నారు.

దేశంలో ఏ పార్టీ కూడా త‌మ‌లా కార్య‌క‌ర్త‌ల సంక్షేమం కోసం ఇంత భారీగా నిధులు ఖ‌ర్చు పెట్ట‌టం లేద‌న్న లోకేశ్‌.. ముఖ్య‌మంత్రి రాష్ట్రానికి చేస్తున్న కృషి గురించి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే..లోకేశ్ మాట్లాడుతున్న‌ప్పుడు ఆస‌క్తిక‌ర‌సంఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. ఆయ‌న ప్ర‌సంగిస్తున్న‌ప్పుడు ఆయ‌న స్పీచ్ స‌మ‌యం ముగిసింద‌న్న సూచ‌న చేస్తూ బెల్లు మోగింది. త‌న‌కింకా నిమిషం మాత్ర‌మే టైం ఉంద‌ని పేర్కొంటూ లోకేశ్ త‌న స్పీచ్ ను కొన‌సాగించారు.

మ‌హానాడులో నేత‌లు మాట్లాడేందుకు ఐదు నిమిషాల స‌మ‌యం ఇస్తారు. గ‌డువు పూర్తి అయ్యే స‌మ‌యానికి నిమిషం ముందు బెల్లు మోగుతుంది. లోకేశ్ మాట్లాడేట‌ప్పుడు కూడా బెల్లును ఆన్ చేసి ఉండ‌టంతో బెల్లు మోగింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/