Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల‌కు చిన‌బాబు శిక్ష‌ణ క్లాస్!

By:  Tupaki Desk   |   6 Oct 2016 10:29 AM GMT
త‌మ్ముళ్ల‌కు చిన‌బాబు శిక్ష‌ణ క్లాస్!
X
విజ‌య‌వాడ‌కు స‌మీపంలోని కేఎల్ యూనివ‌ర్సిటీలో గ‌డిచిన రెండు రోజులుగా టీడీపీ శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాలు.. ఇచ్చిన శిక్ష‌ణ కాస్త భిన్నంగా ఉంద‌న్న అభిప్రాయం ఉంది. ఈ మ‌ధ్య‌కాలంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెర‌పైకి తీసుకొచ్చిన రియ‌ల్ టైం డ్యాష్ బోర్డు విధానంతో పాటు.. కైజాలా యాప్ గురించిన శిక్ష‌ణ‌.. సాంకేతిక అంశాల‌పై స్పెష‌ల్‌ క్లాస్ ఇలా ఒక దానితో మ‌రొక‌టి సంబంధం లేని కార్య‌క్ర‌మాల‌తో శిక్ష‌ణ శిబిరాల్ని నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాత విష‌యం ఏమైనా ఉందంటే.. అది ఎంత‌కూ ఆగ‌ని చంద్ర‌బాబు ప్ర‌సంగం మాత్ర‌మే. ఈ శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌కు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ గ‌డిచిన రెండు రోజులుగా హాజ‌రుకాక‌పోవ‌టం తెలిసిందే. వెన్ను నొప్పి కార‌ణంగా ఆయ‌న శిక్ష‌ణ శిబిరానికి హాజ‌రు కాలేద‌ని చెబుతున్నారు.ఈ కార్య‌క్ర‌మానికి చివ‌రి రోజైన గురువారం..చిన‌బాబు ఎంట్రీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని ప‌ట్టించుకోని నాయ‌కుల్ని పార్టీ ప‌ట్టించుకోద‌ని ఆయ‌న వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. త‌మ్ముళ్ల‌కు క్లాస్ పీకుతున్నట్లుగా మాట్లాడిన చిన‌బాబు.. వివిధ అంశాల‌పై పార్టీ తీసుకుంటున్న చ‌ర్య‌ల్ని ప్ర‌స్తావించారు. నాయ‌కుల ప‌ని తీరును పార్టీ ప‌రిశీలిస్తుంద‌ని.. ప్ర‌తి ఒక్క‌రి ప‌ని తీరుకు సంబంధించిన స‌మాచారం అధినాయ‌కుడి వ‌ద్ద‌కు వెళుతుంద‌ని వెల్ల‌డించారు. పార్టీకి సంబంధించి త‌న‌తో స‌హా.. ప్ర‌తిఒక్క‌రి ప‌ని తీరుకు సంబందించిన నివేదిక పార్టీ అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వెళుతుంద‌ని.. పార్టీకి చేసిన ప‌నికి త‌గ్గ‌ట్లే ప‌ద‌వులు వ‌స్తాయ‌ని ఆయ‌న చెప్పారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వంపై విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల్ని బ‌లంగా తిప్పి కొట్టాల‌న్న సూచ‌న చేశారు. ప‌ద‌వుల‌పై క్లారిటీ ఇవ్వ‌టం స‌రే.. కానీ.. విప‌క్షం చేస్తున్న విమ‌ర్శ‌ల్ని బ‌లంగా తిప్పి కొట్టాల‌న్న సూచ‌న చిన‌బాబు నోటి నుంచి రావ‌టం వెనుక మ‌ర్మం ఏమిటి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/