Begin typing your search above and press return to search.
నారా లోకేష్.. సర్వేలు చేయించుకుంటున్నారా?
By: Tupaki Desk | 16 April 2019 12:05 PM GMTఏపీలో ఈ సారి ఎన్నికల్లో కొన్ని సీట్లలో గెలుపోటముల గురించి అత్యంత ఆసక్తి నెలకొని ఉంది. అలాంటి ఆసక్తిని రేపుతున్న సీట్లలో టాప్ పొజిషన్లో ఉంటుంది మంగళగిరి. అక్కడ నుంచి నారా లోకేష్ గెలుస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై భారీ బెట్టింగులు సాగుతూ ఉన్నాయి. కొందరేమో లోకేష్ గెలుస్తారని అంటుంటే, మరి కొందరు అంత లేదని అంటున్నారు. ఈ అంశంపై భారీగా బెట్టింగులు సాగుతున్నాయిప్పుడు.
ఆ బెట్టింగు ట్రెండ్ లో ఎక్కువమంది నారా లోకేష్ ఓడతారనే కడుతున్నారట! దీంతో నారా లోకేష్ గెలుస్తారని బెట్టింగ్ వేసే వాళ్లు తక్కువైపోయారు. దీంతో..లోకేష్ గెలిస్తే వారి పంట పండనుంది. లోకేష్ గెలుస్తాడంటూ ఒక రూపాయి బెట్ కాస్తే, నిజంగానే అది జరిగితే దానికి రెండు రూపాయలు దక్కే పరిస్థితి ఉందట. రూపాయికి రెండు రూపాయలు..అనేది నారా లోకేష్ విజయం మీద సాగుతున్న బెట్!
లోకేష్ ఓడతారు అంటూ బెట్ కాసే వాళ్లకు ఎక్కువమంది ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అసలు ఒక దశలో ఆయనకు టికెట్ దక్కుతుందా? అనే సందేహాన్ని రేకెత్తించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇప్పుడు హాట్ ఫేవరెట్ గా మారారు.
నాలుగైదే వేల మెజారిటీలో ఆళ్ల గెలవడం ఖాయమనే మాట వెబ్ లో వైరల్ గా మారింది. ఇక అసలు కథ ఏమిటనేది ఫలితాలు వస్తే కానీ తెలియదు.
ఇక లోకేష్ మాత్రం పోలింగ్ అయిపోయాకా పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు. పోలింగ్ రోజున నిరసన తెలిపిన ప్రసంగంలో లోకేష్ ‘బిస్కెట్లు ఇవ్వలేదు..’అని అనడం పొరపాటు అయిపోయింది. ఓటు వేసే
వాళ్లకు టీలు, బిస్కెట్లు ఏర్పాటు చేయడం ఎన్నికల కమిషన్ బాధ్యత కాదు కదా. అలా మాట్లాడి లోకేష్ మరోసారి సోషల్ మీడియాకు చిక్కారు.
ఇక లోకేష్ మంగలగిరి గురించి సర్వేలు చేయించుకుంటున్నారనే మాట వినిపిస్తుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉందనే అంశం గురించి.. పోలింగ్ ఎలా జరిగి ఉందనే విషయంలో.. లోకేష్ పోస్ట్ పోల్ సర్వేలో మునిగారట!