Begin typing your search above and press return to search.
బాబు ఫెయిల్యూర్స్ నుంచి లోకేశ్ టార్గెట్లు
By: Tupaki Desk | 4 May 2017 11:08 AM GMTఏపీ మంత్రి నారా లోకేశ్ తండ్రిని మించిన తనయుడిగా ఎదిగిపోతున్నాడని వైసీపీ నేతలు అంటున్నారు. ముఖ్యంగా సొంత డబ్బా కొట్టుకోవడంతో చంద్రబాబుని దాటేసి లోకేశ్ ఎక్కడికో వెళ్లిపోతున్నాడట. సెల్ఫ్ ప్రమోషన్లో చంద్రబాబు కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారని అంటున్నారు. మంత్రి అయి నెల రోజులైందో లేదో అప్పుడే లోకేష్ తన గురించి గట్టిగానే ప్రమోషన్ చేసుకుంటుండడంతో వైసీపీ నేతలు ఈ విమర్శలు చేస్తున్నారు.
నవ్యాంధ్ర అభివృద్ధిలోభాగంగా తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని లోకేశ్ చెబుతుండడమే అందుకు ఉదాహరణ అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఐటీ కంపెనీతో ఒప్పందం సందర్బంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన లోకేష్…తాను వంద రోజుల కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నానని అప్పుడే 31 రోజులు పూర్తయిందని చెప్పారు. ఏపీ కోసం తాను నిద్రాహారాలు మాని పనిచేస్తున్నానని చెప్పుకొన్నారు. ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తానన్నారు. రాష్ట్రానికి ఎంతో నమ్మకమైన ముఖ్యమంత్రి చంద్రబాబు అని కితాబిచ్చారు. చంద్రబాబుకు మంచి మార్కెటింగ్ నైపుణ్యం ఉందన్నారు.
అయితే... లోకేశ్ మాటలతో ఇంతకాలం చంద్రబాబు ఎంతగా ఫెయిలయ్యారన్నది అర్థమైపోతుందని వైసీపీ నేతలు అంటున్నారు. బాబు వస్తే జాబు గ్యారెంటీ అన్ననినాదాన్ని అదే పనిగా చెప్పిన చంద్రబాబు.. ఆయన పవర్‌లోకి వచ్చిన గత మూడేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని... అందుకే లోకేశ్ ఇప్పుడు ఫ్రెష్ లక్ష్యాలు పెట్టుకుంటున్నారని అంటున్నారు.
మరోవైపు రాష్ట్రంలో తమ సంస్థల్ని నెలకొల్పటానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని.. కానీ అందుకు తగిన కార్యాలయాలు.. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ తరహాలో ఆఫీస్ స్పేస్ సిద్ధంగా లేకపోవటం ఇబ్బందిగా మారిందని లోకేశ్ చెప్పుకొచ్చారు. మూడేళ్ల విలువైన కాలంలో.. ఈ విషయాన్ని ముందే గుర్తించి విశాఖపట్నంలోనూ.. హైదరాబాద్‌లోనూ భారీ నిర్మాణాల్ని మూడేళ్ల కిందటే మొదలెట్టినా..ఆ భవనాలన్నీ ఎప్పుడో పూర్తి అయ్యేవని.. హడావుడిగా తాత్కాలిక సచివాలయం.. తాత్కాలిక అసెంబ్లీ పేరిట వందల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు.. వాటితో పాటు.. ఉద్యోగఅవకాశాలు కల్పించే ఆఫీస్ స్పేస్ ను సిద్ధం చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/