Begin typing your search above and press return to search.
లోకేశ్ ‘‘మాస్టర్’’ప్లాన్
By: Tupaki Desk | 11 July 2016 9:40 AM GMT చంద్రబాబునాయుడు గత రెండు టెర్ముల పాలనలో ఉద్యోగులను మూడు చెరువుల నీళ్లు తాగించి ఉరుకుల పరుగులు పెట్టడంతో వారంతా ఆయనకు దూరమయ్యారు. ఫలితంగా చంద్రబాబు పదేళ్లు అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. ఉద్యోగ - ఉపాధ్యాయ వర్గాలను దూరం చేసుకున్న ఫలితంగానే అధికారం కోల్పోయానని గట్టిగా నమ్మిన చంద్రబాబు మళ్లీ అధికారం చేపట్టిన తరువాత అధికారులు విషయంలో చాలా మెతగ్గా వ్యవహరిస్తూ వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి ఉపాధ్యాయులను కూడా పూర్తిగా టీడీపీవైపు తిప్పుకొనేలా చేసేందుకు టీడీపీ చక్రం తిప్పుతోంది. అందుకు యువనేత లోకేశ్ పథక రచన చేస్తున్నట్లుగా సమాచారం.
సమాజంపై ప్రభావం చూపే వ్యక్తుల్లో టీచర్లు ముందుంటారు.. ఇతర ఉద్యోగుల కంటే కూడా ఉపాధ్యయులకు సమాజంతో సంబంధాలు ఎక్కువ. అలాగే ఎన్నికల నిర్వహణలోనూ వారిదే కీలక పాత్ర. ఆ సంగతి గుర్తించే లోకేశ్ టీచర్లను అట్రాక్టు చేయడానికి మాస్టర్ ప్లాన్ రెడి చేశారట. ఇప్పటికే లోకేశ్ ఆదేశాలు అందుకున్న టీచర్ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ కార్యరంగంలోకి దిగారట. టీడీపీకి అనుబంధంగా ఉన్న తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘాన్ని వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా బలోపేతం చేయడానికి కసరత్తు చేస్తున్నారట. అది బలోపేతం కావాలంటే ప్రస్తుతం బలంగా ఉన్న పీఆర్టీయూ - ఎస్టీయూ - యూటీఎఫ్ - ఏపీటీఎఫ్ వంటి సంఘాలన్నీ కనుమరుగు కావాలని లోకేశ్ ఆదేశించారట. దీంతో ఏఎస్ రామకృష్ణ ఇప్పుడు అన్ని రకాల ఎత్తుగడల దిశగా ఆలోచిస్తున్నట్లు టాక్.
ప్రస్తుతం ఉన్న సంఘాల్లో చీలికలు తేవడం.. ఉపాధ్యాయుల అవసరాలను ఆసరాగా చేసుకుని తమ సంఘాల్లో చేరేలా చేయడం వంటి ఎత్తుగడలు అమలు చేసే దిశగా కార్యాచరణకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఈ ఆపరేషన్ టీచర్ కార్యక్రమం పూర్తిగా అమలు చేసేందుకు చినబాబు పథక రచన చేస్తున్నట్లు సమాచారం.