Begin typing your search above and press return to search.
బాలయ్య పిఏ ఇష్యూను లోకేశ్ క్లోజ్ చేస్తారట
By: Tupaki Desk | 6 Feb 2017 9:28 AM GMTఎక్కడా లేని చిత్రమైన దృశ్యం ఏపీలో కనిపిస్తోంది. ఏపీ అధికారపక్షానికి చెందిన ఒక ఎమ్మెల్యే పీఏకు.. పార్టీ నేతలకు మధ్య నడుస్తున్న రచ్చ రోజుల తరబడి సా..గుతూనే ఉంది. మామూలుగా అయితే.. ఆరోపణలు వచ్చిన వెంటనే పీఏను తీసి పక్కకకు పారేయటం మామూలే. కానీ.. ఇది బాలయ్య పీఏ యవ్వారం కావటమే అసలు ఇష్యూగా మారింది. అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నుంచి ఎన్నికల బరిలో దిగి విజయం సాధించిన బాలకృష్ణ.. ఆ నియోజకవర్గాన్ని మొత్తంగా మార్చేస్తానని.. తరచూ తాను నియోకవర్గంలో పర్యటిస్తానని చాలానే మాటలు చెప్పారు.
అయితే.. ప్రాక్టికల్ గా అలాంటివి సాధ్యం కాకపోవటం.. తనకు నమ్మకస్తుడైన శేఖర్ ను తన పీఏగా పెట్టుకున్నారు. నియోజకవర్గంలో బాలయ్య అందుబాటులో లేని వేళల్లో అంతా తానైనట్లుగా వ్యవహరించే శేఖర్ తీరుపై మొదట్నించి చాలానే విమర్శలు.. ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో అతగాడి గురించి బాలయ్యకు నేరుగా చెప్పేంత ధైర్యం ఎవరికి లేదని చెబుతారు.
తాజాగా పీఏ శేఖర్ తీరు ఇబ్బందికరంగా మారిందని.. అతను కావాలా? మేము కావాలా? అనే వరకూ తెలుగు తమ్ముళ్లు వెళ్లటం.. అదే సమయంలో బాలయ్య పీఏ శేఖర్ బెదిరింపుల ఆడియో క్లిప్ బయటకు రావటంతో ఈ ఉదంతం విస్తృతి మరింత పెరిగింది. నిజానికి ఇలాంటి ఉదంతాలు బయటకు వచ్చినప్ప్డు అధినాయకత్వమో.. లేదంటో పార్టీ పెద్దలో కలుగజేసుకోవటం కనిపిస్తుంది.
కానీ.. ఇది బాలయ్య పీఏ వ్యవహారం కావటంతో ఎవరూ కలుగజేసుకోవటానికి ఇష్టపడటం లేదట. దీనికి తోడు శేఖర్ కు బాలయ్య ఫుల్ సపోర్ట్ గా నిలవటం కూడా ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. ఒక ఎమ్మెల్యే పీఏ కోసం ఇంత రచ్చ జరగటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటివి ఉంటాయా? అని నోళ్లు నొక్కుకునే పరిస్థితి.
ఇప్పటికి ఈ ఇష్యూను సెట్ చేయకపోతే.. పార్టీ ఇమేజ్ దారుణంగా దెబ్బ తింటుందని చినబాబు లోకేశ్ దృష్టికి కొందరు తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. బాలయ్యను చినబాబు మాత్రమే డీల్ చేస్తారన్న మాట పార్టీ నేతలు పలువురు వ్యాఖ్యానించటం గమనార్హం. దీనికి తగ్గట్లే.. పీఏ శేఖర్ ఇష్యూను తాను టేకప్ చేశానని.. తాను డీల్ చేస్తానని పార్టీ వర్గాలకు భరోసా ఇస్తున్నారట. చినబాబు రంగంలోకి దిగిన నేపథ్యంలో ఈ ఇష్యూ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/