Begin typing your search above and press return to search.
విశాఖ నార్త్ లోకేష్ కు కలిసొస్తుందా?
By: Tupaki Desk | 13 March 2019 6:48 AM GMTచంద్రబాబు తనయుడు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం పక్కా. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు లేవు. కాకపోతే.. ఎక్కడ పోటీచేస్తారు అనేదే ఇంకా తేలలేదు. లోకేష్ కోసం ఎవరు త్యాగరాజు అవతారం ఎత్తబోతున్నారు అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోనుంది. నిన్నటికి నిన్న మంగళగిరి నుంచి పోటీ చేస్తారు అని వార్తలు వచ్చినా వాటిని టీడీపీ అధిష్టానం కన్ ఫర్మ్ చేయలేదు. దానికి కారణం.. మంగళగిరిలో కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ ఎక్కువ. వాళ్లంతా ఇప్పడు పవన్ తో ఉన్నారు. ఏదైనా తేడా కొడితే అసలుకే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు లోకేష్ సీటుని మంగళగిరి నుంచి విశాఖ ఉత్తరానికి మార్చినట్లు వార్తలు వస్తున్నాయి.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత విశాఖ నార్త్ అనే నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో 2009లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి తైనాల విజయ్ కుమార్ విజయం సాధించారు. రెండో స్థానంలో పీఆర్ పీ నిలిచింది. మూడో స్థానానికి టీడీపీ పడిపోయింది. ఆ తర్వాతి ఎన్నికల్లో విశాఖ ఉత్తరం అంటేనే భయపడిపోయిన చంద్రబాబు తెలివిగా ఈ స్థానాన్ని బీజీపీకి అంటగట్టేశారు. అదృష్టం బావుండి అక్కడే బీజేపీ గెలిచింది. కానీ ఈసారి అటు బీజేపీకి కానీ ఇటు టీడీపీకి కానీ ఎవ్వరికీ అక్కడ పరిస్థితి సానుకూలంగా లేదు. దీంతో.. విశాఖ ఉత్తరం నుంచి లోకేష్ ని పోటీ చేయించాలంటేనే చంద్రబాబు వణికిపోతున్నాడు. అదీగాక.. ఇప్పుడు విశాఖ పరిస్థితి టీడీపీకి అంత అనుకూలంగా లేదు. చాలామంది అసంతృప్తులు టీడీపీ ఎమ్మెల్యేల్ని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉత్తరం నుంచి లోకేష్ కనుక పోటీచేస్తే.. ఉన్న పరువు కూడా పోగొట్టుకోవడం కన్ ఫర్మ్ అని రాజకీయ విశ్లేషకుల అంచనా.