Begin typing your search above and press return to search.
చినబాబు తడబాటుతో పీవీ టీడీపీ నేతయ్యారు
By: Tupaki Desk | 28 Jun 2017 10:38 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు.. ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. తొందరపాటో.. కన్ఫ్యూజనో అర్థం కాదు కానీ.. ఆయన తరచూ మాటలు తప్పుగా చెప్పేస్తుంటారు. గతంలోనూ ఏపీ అసెంబ్లీ స్థానాల గురించి తప్పుగా చెప్పి అడ్డంగా బుక్ అయ్యారు. అంబేడ్కర్ జయంతిని వర్థంతిగా పేర్కొనటమే పెద్ద తప్పు అయితే.. ఆ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పి.. దిమ్మ తిరిగిపోయేంతగా షాక్ ఇచ్చారు.
లోకేశ్ నోటి నుంచి వచ్చే ఈ మాటల్ని ఎవరైనా తప్పు పట్టినా.. విమర్శించినా ఏపీ అధికారపక్ష నేతలు తీవ్రంగా విరుచుకుపడుతుంటారు. తప్పు పట్టుకున్న వారిని తిట్టే బదులు.. తమ నేత తప్పుగా మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పొచ్చు కదా? అన్న ప్రశ్నకు తెలుగు తమ్ముళ్ల నుంచి సమాధానం రాని పరిస్థితి. తాజాగా తనదైన శైలిలో తప్పుగా మాట్లాడిన లోకేశ్ వార్తల్లోకి ఎక్కేశారు.
ఏపీ పంచాయితీ కమ్ ఐటీ మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతిని పురస్కరించుకొని పీవీ గురించి చెబుతూ పెద్ద తప్పే మాట్లాడేశారు. ఆయన్ను తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధాని అయ్యారంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తన తప్పును గుర్తించిన ఆయన సవరించుకునే ప్రయత్నం చేయటం కనిపించింది.
పీవీ జయంతిని ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నుంచి పీవీ ప్రధాని అయ్యారంటూ వ్యాఖ్యానించి.. ఆ వెంటనే తెలుగు ప్రజల నుంచి పీవీ ప్రధాని అయ్యారంటూ కవర్ చేసుకున్నారు. అయితే.. అప్పటికే చినబాబు మాటల్ని అర్థం చేసుకున్న మీడియా ప్రతినిధులు ముసిముసిగా నవ్వుకోవటం కనిపించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/