Begin typing your search above and press return to search.
ఫ్యాన్ కింద చల్లన.. లోకేష్ తడబాటు
By: Tupaki Desk | 31 March 2019 7:19 AM GMTఏపీ సీఎం చంద్రబాబు తనయుడు - మంత్రి నారా లోకేష్ మరోజారి నోరుజారి చిక్కుల్లో పడ్డారు. ఇటీవలే ఏప్రిల్ 11న పోలింగ్ ఉండగా.. ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు పోలింగ్ నాడు ఓటు వేయాలంటూ లోకేష్ ప్రచారంలో నోరుజారడం వైరల్ గా మారింది.
ఇక మంగళగిరిలోని నూతక్కిలో శుక్రవారం నారా లోకేష్ ప్రచారంలో మరోసారి ఠంగ్ స్లిప్ అయ్యారు. మే 23న ఎన్నికల కౌంటింగ్ ఉండగా.. మార్చి 23 అంటూ నోరుజారారు. మార్చి 23న ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని అనడంతో అంతా విస్తుపోయారు. అలాగే దేశంలో 29 రాష్ట్రాలున్న సంగతి తెలిసిందే.. కానీ 28 రాష్ట్రాలు మాత్రమే అనడంతో ఆయన వెంట ఉన్న వారు ఖంగుతిన్నారు.
ఇక తాజాగా ఆదివారం నారా లోకేష్ మరోసారి ప్రసంగంలో అదుపుతప్పారు. ‘ఇక నుంచి మరోసారి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మా ఇంట్లో ‘ఫ్యాన్’ కింద కూర్చొని చల్లగా కబుర్లు చెప్పుకుందాం.. మీరెవరూ అధైర్యపడవద్దు’ అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లు అంతా అవాక్కయ్యారు. మంగళగిరి రత్నాలచెరువులో లోకేష్ ప్రతిపక్ష వైసీపీ గుర్తు ఫ్యాన్ కింద చల్లాగా ఉంటుందనడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అందరూ ఈ వీడియోను షేక్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు.
ఇక మరోవైపు లోకేష్ తరుఫున సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు బెంగళూరుకు చెందిన ఓ కంపెనీతో టీడీపీ ఒప్పందం కుదుర్చుకుందట.. కానీ లోకేష్ తప్పులతడక డైలాగులకు వెరిసి వారు వెనక్కి తగ్గినట్టు సమాచారం.