Begin typing your search above and press return to search.
ఆర్టీసీ బస్సు లో నవ్వుల పాలైన లోకేష్
By: Tupaki Desk | 11 Dec 2019 8:30 AM GMTమాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు మరోసారి నవ్వుల పాలయ్యాడు. ఆర్టీసీ చార్జీల పెంపు పై నిరసనకు బయలు దేరిన నారా లోకేష్ స్వయంగా పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. అయితే తన ఒక్కడికే టికెట్ తీసుకొని.. తనతోపాటు బస్సెక్కిన టీడీపీ ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలకు టికెట్ తీసుకోలేదు.
నా దగ్గర డబ్బు లేదని.. అందరికీ టికెట్లు తీసుకోవాలా? అని భయపడిపోయారు? ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లోకేష్ పాటు నిరసనలో పాల్గొనడానికి బస్సెక్కిన వారంతా లోకేష్ తీరు చూసి జేబులు తడుముకొని పక్కోళ్లను అడిగి టికెట్ తీసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టికెట్ కు కూడా డబ్బులేని లోకేష్ తీరు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.
ఆర్టీసీ చార్జీల పెంపుపై బుధవారం టీడీపీ ఎమ్మెల్సీలతో కలిసి నారా లోకేష్ ఆర్టీసీ బస్సులో మంగళగిరి నుంచి అసెంబ్లీ వరకు ప్రయాణించారు. పెంచిన చార్జీలపై ప్రయాణికులను ఆరాతీశారు. 15 కిలోమీటర్లకు రూపాయిన్నర పెరగాలని.. జగన్ సర్కారు 5 రూపాయలు అధికంగా పెంచిందని ప్రయాణికులు లోకేష్ దృష్టి కి తీసుకెళ్లారు. ఏడాదికి 700 కోట్ల నుంచి వెయ్యి కోట్ల దాకా ప్రజలపై భారం పడుతోందని లోకేష్ విమర్శించారు. పెంచిన చార్జీలు తగ్గించే వరకూ పోరాటం చేస్తామన్నారు.