Begin typing your search above and press return to search.
సేమ్ స్టయిల్ : ప్రకాష్‌రాజ్ = నారా లోకేష్ !!
By: Tupaki Desk | 21 Aug 2016 10:30 PM GMT'నాకు లాక్కోవడం ఇష్టం'' అంటూ పోకిరి సినిమాలో విలన్ ప్రకాష్ రాజ్ కు ఓ అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ వ్యవహారాన్ని గమనిస్తే కూడా అలాగే అనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఇప్పటికే నానా రకాలుగా ప్రలోభ పెట్టి తమ పార్టీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ లాక్కోవడాన్ని తెలుగుదేశం పార్టీ ఇంకా కొనసాగించడానికే చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.
వైకాపా నుంచి ఇంకా పలువురు ఎమ్మెల్యేలను 'లాక్కోవడానికి' నారా లోకేష్ రంగం సిద్ధం చేస్తున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. స్థానికంగా ఆయా ప్రాంతాల్లో తమ పార్టీకి చెందిన ఎంత గొప్ప సీనియర్లు ఉన్నా ఖాతరు చేయకుండా, వారిని పక్కన పెట్టి, స్థానికంగా తమకున్న నాయకత్వం అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా, వైకాపా ఎమ్మెల్యేలను లోకేష్ లాక్కోడానికి ప్రయత్నిస్తున్నట్లు పుకార్లున్నాయి.
ఆ క్రమంలోనే నారా లోకేష్ తాజాగా నరసరావుపేటకు చెందిన సీనియర్ నాయకుడు - ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెలతో భేటీ అయినట్లు చెప్పుకుంటున్నారు. నిజానికి కోడెల నరసరావు పేటకు చెందిన వారే అయినా.. సత్తెనపల్లి నుంచి గత ఎన్నికల్లో గెలిచారు. పేటలో అయితే ఎట్టి పరిస్థితుల్లో గెలవరని చంద్రబాబు సర్వేలు చెప్పడంతో, ఆయనకు సత్తెనపల్లి టికెట్ ఇచ్చారు. అక్కడ కూడా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా గెలిచారు. అయితే పేట రాజకీయాల మీద తన పట్టు తప్పి పోకూడదని మాత్రం అనుకుంటున్నారు.
అయితే నరసరావుపేట వైకాపా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిని తెదేపాలో చేర్చుకోవడానికి లోకేష్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫిరాయింపును కోడెల వ్యతిరేకిస్తుండడంతో ఆయనను కలిసి పార్టీకోసం ఒప్పుకోవాల్సిందేనని లోకేష్ చెప్పారని అనుకుంటున్నారు. వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకోడానికి ఎక్కడ లోకల్ లీడర్‌షిప్ వ్యతిరేకించినా.. వారి అభిప్రాయాల్ని లోకేష్ దారుణంగా తొక్కేస్తున్నారు. అదే క్రమంలో ఇప్పుడు కోడెల అభిప్రాయాల్ని కూడా తొక్కేసి.. శ్రీనివాసరెడ్డిని తమ పార్టీలోకి 'లాక్కుంటారని' ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ వైనం గమనించిన వారు.. పోకిరి డైలాగును గుర్తు చేసుకుని.. ప్రకాష్ రాజ్ - నారా లోకేష్ ఇద్దరి స్టయిలూ ఒకే తీరుగా ఉన్నదని అనుకుంటున్నారు.