Begin typing your search above and press return to search.
నారా లోకేశ్!.. జనసేన సేవియర్!
By: Tupaki Desk | 25 Feb 2019 11:46 AM ISTటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ కేబినెట్ లో కీలక మంత్రి నారా లోకేశ్... ఇప్పుడు మరో కొత్త డ్యూటీని భుజానికెత్తుకున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీకి ప్రధాన కార్యదర్శిగా తనదైన శైలిలో సత్తా చాటిన లోకేశ్.. మంత్రి పెద్దగా రాణించడం లేదనే విమర్శలు వినిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే.. ఆపై వచ్చే ఎన్నికల్లోగానే లోకేశ్... ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడం గ్యారెంటీనే అని చెప్పాలి. మంత్రిగా తన శాఖ నిర్వహణపై నిత్యం యమా యాక్టివ్ గా ఉన్నట్లు కలరింగ్ ఇచ్చేస్తున్న లోకేశ్... తాజాగా మరో కొత్త బాధ్యతల్లోకి కూడా దిగిపోయారు. ఆ బాధ్యతలేమిటంటే... జనసేనకు రక్షకుడి బాధ్యత.
మొన్న గుంటూరు జిల్లాలో జనసేన వర్సెస్ వైసీపీ కార్యకర్తల గొడవ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే కదా. ఆ ఘటనలో వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారట. ఈ దాడిలో జనసేనకు చెందిన పలువురు మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై చాలా సీరియస్ గా రియాక్ట్ అయిన లోకేశ్... వైసీపీ తీరుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వైసీపీ దాడిని తీవ్రంగా ఖండించిన లోకేశ్... మహిళలని కూడా చూడకుండా దాడికి తెగబడతారా? అంటూ వైసీపీని ఏకంగా *వైఛీపీ* అనేశారు. ట్విట్టర్ వేదికగా ఈ దాడిని ఖండిస్తూ లోకేశ్... తన ట్వీట్ కు గాయపడ్డ జనసేన మహిళా కార్యకర్తల ఫొటోలను కూడా ట్యాగ్ చేశారు.
ఈ సందర్భంగా లోకేశ్ ఏమన్నారన్న విషయానికి వస్తే... *వై ఛీ పీ మూకలు గుంటూరు ఏటీ అగ్రహారంలో జనసేన కార్యకర్తల మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ! మహిళలు అని కూడా చూడకుండా రాళ్లు రువ్వటం సభ్య సమాజానికే సిగ్గు చేటు!!* అని లోకేశ్ తనదైన శైలో వైసీపీ దాడిపై దండెత్తారనే చెప్పాలి. ఈ ట్వీట్ తో వైసీపీ దుర్మార్గాలను తీవ్రంగా ఖండించిన టీడీపీ నేతగానే కాకుండా జనసేన సేవియర్ గానూ ఆయన తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పక తప్పదు.