Begin typing your search above and press return to search.

శ్రీ‌శ్రీ ప్రేమ అనంతం మ‌రి ! లోకేశ్ ప్రేమ ?

By:  Tupaki Desk   |   30 April 2022 8:30 AM GMT
శ్రీ‌శ్రీ ప్రేమ అనంతం మ‌రి ! లోకేశ్ ప్రేమ ?
X
మ‌నిషిని స్మ‌రించే క్ర‌మాన్ని ఇష్ట‌పడుతూ ఇవాళ శ్రీ‌శ్రీ‌ని త‌ల‌చిన యువ నాయ‌కుడు లోకేశ్ కు ఓ కృత‌జ్ఞ‌త ఓ ధ‌న్య‌వాద.. ఇదంతా బాగుంది కానీ ఆ రోజు శ్రీ‌శ్రీ కోరుకున్న విధంగా లేదా మ‌హాక‌వి ప్ర‌తిపాద‌న‌ల‌కు అనుగుణంగా పాల‌న అన్న‌ది ఏ రోజ‌యినా సాధ్య‌మా చెప్పండి లోకేశ్..ఇవ‌న్నీ మీరు త‌ల్చుకునేందుకు బాగుంటాయి కానీ ఆచ‌ర‌ణ‌కు సాధ్యం కావు. మీర‌యినా జ‌గ‌న్ అయినా త‌లుచుకోవ‌డం వ‌ర‌కే ప‌రిమితం.

శ్రీ‌శ్రీ అనే మ‌హాక‌వి జ‌యంతి. ఆయ జ‌యంతిని మ‌న నాయ‌కులు స్మ‌రించుకుంటున్నారు. విశాలాంధ్ర‌ను స్వ‌ప్నించిన శ్రీ‌శ్రీ‌ని మ‌న నాయ‌కులు స్మ‌రించుకుంటున్నారు. కార‌ణాలు ఏమ‌యినా మ‌న నాయ‌కుల‌కూ, శ్రీ‌శ్రీ కీ మ‌ధ్య ఏ అనుబంధం ఉందో కానీ ఎప్ప‌టిలానే వాళ్లు ఆయ‌న సాహిత్యాన్ని మాత్రం త‌మ‌కు అనుగుణంగా, ప‌రిస‌రాల‌కు అనుగుణంగా నేప‌థ్య సారాంశానికి అనుగుణంగా వాడుకుంటున్నారు. ఆ విధంగా మ‌న నాయ‌కులకు ఏటా శ్రీ‌శ్రీ గుర్తుకు వ‌స్తున్నారు.

ఆ విధంగానే లోకేశ్ కూడా ఆయ‌న్ను గుర్తు చేసుకుంటున్నారు. త‌ప్పేం లేదు కానీ.. శ్రీ‌శ్రీ స్వ‌ప్నించిన మ‌రో ప్రపంచం మ‌రో ప్ర‌పంచం పిలిచింది.. బాట‌లు విడిచి పేట‌లు విడిచి అని అన్న విధంగా సాధ్య‌మా ? అనేక అస‌మాన‌త‌లు ఉన్న రాజ్యాన లోకేశ్ కు ఇవి అర్థం అయి ఉంటున్నాయా అని? పోనీ లోకేశ్ వ‌ర‌కూ ఎందుకు కానీ ఆ రోజు చంద్ర‌బాబుకు కానీ ఇవాళ జ‌గ‌న్ కు కానీ అర్థం అయి ఉన్నాయా ? క‌నుక రాజ‌కీయ శ‌క్తులు అవ‌స‌రం రీత్యా మ‌హాక‌వుల పేర్ల‌ను రాస్తుంటారు. చ‌దువుతుంటారు. స్మ‌రిస్తుంటారు.

జీవితాన్ని ఎలా అయినా గ‌డ‌పండి కానీ ఓ ప్ర‌త్యేక‌త‌ను న‌మ్ముకోండి. జీవితం నుంచి జీవితం వ‌ర‌కూ యుద్ధం చేయండి కానీ ఓడిపోయినా గెలిచినా ఓ అజ‌రామ‌త్వం పొంది ఉండాల‌ని నిర్ణ‌యించుకోండి. ప‌దండి ముందుకు..ప‌డండి తోసుకు.. ఇవి చాలు తెలుగు సాహిత్యంలో మ‌రింత దృక్ప‌థాలు స్థిరం కావ‌డానికి.. సాహిత్యంతో అనేక రోజులుగా ప‌రిచ‌యం ఉన్న‌వారికి శ్రీ‌శ్రీ తెలుస్తాడు. శ్రీ‌శ్రీ లోతు తెలియ‌వ‌స్తుంది.

ఇప్పుడిప్పుడే స్వేద ధార‌ల చెంత ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న నారా లోకేశ్ కూడా ఆ ప్ర‌య‌త్న‌మే ఇవాళ చేశారు. ఆయ‌న‌కు నివాళులర్పించారు. ఆ విధంగా జ‌యంతి వేళ వారికి నివాళులు మ‌న త‌ర‌ఫున.. అంటూ ఓ పోస్టు పెట్టారు సామాజిక మాధ్య‌మాల్లో.. ! ఆయ‌నేమ‌న్నారంటే...

"సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఉంటుందని నమ్మి, చివరి వరకు పీడిత ప్రజల ప్రతినిధిగా, వారి గొంతుకను తన రచనల ద్వారా వినిపించారు శ్రీశ్రీ. సమాజంలో మార్పు కోసం తపిస్తూ అభ్యుదయ ప్రభంజనం సృష్టించారు. ఈరోజు శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆ ప్రజాకవి సాహితీ సేవను స్మరించుకుందాం."