Begin typing your search above and press return to search.
పారిశ్రామికవేత్తలతో చినబాబు బిజీబిజీ
By: Tupaki Desk | 7 May 2015 9:10 AM GMTఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచటంతోపాటు.. ఏపీలో ఉన్న అవకాశాల్ని చెప్పటం.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ అమెరికా పర్యటన సాగుతున్న విషయం తెలిసిందే. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన బిజీబిజీగా ఉంటున్నారు.
అమెరికా నుంచి తిరిగి వచ్చే సమయానికి కొన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవటంతోపాటు.. తన పర్యటన కారణంగా ఏపీకి ఏంత మేర పెట్టుబడులు రానున్నాయన్న విషయాన్ని చెప్పేందుకు లోకేశ్ అండ్ కో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వివిధ కంపెనీల ముఖ్య అధికారుల్ని.. కీలక వ్యక్తులతో భేటీ అవుతూ..ఏపీలో ఉన్న విస్తృత అవకాశాల గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
విభజన నేపథ్యంలో ఏపీలో ఉన్న అవకాశాల గురించి ఆయన చెబుతూ.. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయని.. పరిశ్రమలు..కంపెనీల ఏర్పాటుకు ఏపీ సర్కారు అనుసరిస్తోన్న విధానాల్ని ఆయన వివరిస్తున్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమలకు ఇచ్చే అనుమతుల విషయంలో సింగిల్ విండో విధానాన్ని పాటిస్తున్న విషయంతోపాటు.. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి మించిన ప్రాంతం మరొకటి ఉండదన్న విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి బాబు విజన్‌ను ఆయన ప్రచారం చేస్తున్నారు.
గత కొద్ది రోజుల్లో లోకేశ్ భేటీ అయిన పలు కంపెనీలు సీఈవోలు.. ముఖ్యుల్ని చూస్తే.. ఇన్ఫోసిస్ సీఈఓ సిక్కా, భారత సంతతికి చెందిన అమెరికన్, సన్ మైక్రోసిస్టమ్ సహ స్థాపకుడు వినోద్ కోస్లా, అడోబ్ సిస్టమ్ సీఈఓ శంతను నారాయణ్, అరుబ నెట్‌వర్క్ సీటీఓ మెట్ కిర్తి మేల్కోటే తదితరులతో భేటీ అయ్యారు. మీటింగ్స్ జోరుగా సాగుతున్నాయి. అంతిమంతా ఏపీకి ఏ మేరకు పెట్టుబడులు వస్తున్నాయో చూడాలి.