Begin typing your search above and press return to search.
లోకేష్ గెలుపు ఆయనకే కాదు... పార్టీకి ఎంత ఇంపార్టెంట్ అంటే..!
By: Tupaki Desk | 22 Feb 2023 8:00 PM GMTటీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలి. ఇది ఆయనకు ఒక సవాల్. అంతేనా? అంటే.. కాదు.. పార్టీకి కూడా అంతే కీలకం. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ ఓడిపోయారు. ఇప్పుడు మరోసారిఓ డిన చోటే గెలుపు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టాల్సిన అవసరం ఉందని లోకేష్ అభిమానులు కోరుతున్నారు.
అయితే.. ఇక్కడ మరో కీలక కారణం కూడా ఉంది. వచ్చే మార్చి 29తో నారా లోకేష్ ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తవుతుంది. అంటే.. ఇక, ఆయన చట్టసభల్లోకి అడుగు పెట్టే అవకాశం లేదు. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై మండలిలో నారా లోకేష్ గర్జించా రనే చెప్పాలి. అతి తక్కువ సమయంలోనే ఆయన అమితమైన అనుభవాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వ పెద్దలకు మండలిలోనే చుక్కలు చూపించారు.
అయితే.. ఇది మార్చితో ముగియనుంది. దీంతో వచ్చే ఎన్నికల వరకు కూడా ఆయన వెయిట్ చేయాలి. అంటే.. అటు చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లనని ఒట్టు పెట్టుకున్నారు. ఇటు నారా లోకేష్ మండలి సభ్యత్వం కూడా పూర్తయిపోతోంది.
మొత్తంగా ఏడాది పాటు.. నారా కుటుంబం చట్టసభల్లో ప్రాధాన్యం లేకుండా పోనుంది. ఇక, నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే.. 2024లో ఏర్పడే కొత్త అసెంబ్లీలోనే ఆయన అడుగు పెట్టాలి.
ఒకవేళ ఆయన ఓడితే.. పరిస్థితి ఏంటి? అంటే.. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా.. లేక.. పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా భారీ సంఖ్యలో సీట్లు సంపాదించుకున్నా.. అప్పుడు మరోసారి నారా లోకేష్ ఎమ్మెల్సీగా అడుగు పెట్టే అవకాశం ఉంది.
ఇది జరగాలంటే.. మరో ఏడాదిన్నరకు పైగానే వెయిట్ చేయాలి. అంటే.. మొత్తంగా నారా లోకేష్ గళం చట్టసభలో వినాలంటే.. పార్టీ నేతలు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని.. ఆయన గెలుపు కేవలం ఆయనకే కాదు.. పార్టీకి కూడా అవసరమని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.