Begin typing your search above and press return to search.
విజయసాయి x లోకేష్.. ట్విట్టర్ వార్
By: Tupaki Desk | 2 July 2019 9:48 AM GMTఏపీలో అధికారం బదలాయింపు జరగడంతో ఓడలు బండ్లు అయ్యాయి. తమను గతంలో ఎంత ఇబ్బంది పెట్టిన టీడీపీ చేసిన అక్రమాలన్నింటిని వైసీపీ ప్రభుత్వం వెలికితీస్తోంది. ఈ కోవలోనే మాటల మంటలు చెలరేగుతున్నాయి. మొదటి నుంచి విలేకరులతో తక్కువ మాట్లాడుతూ.. ట్విట్టర్ సామాజికమాధ్యమం ద్వారా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెలరేగిపోతున్నారు.
టీడీపీపై ఇప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ సాక్షిగా సంధిస్తున్న ప్రశ్నలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. టీడీపీ నేతల బండారం బయటపెట్టేలా విజయసాయి ట్వీట్లతో ఎండగడుతున్నారు.
తాజాగా మాజీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ను విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు. ఆయనపై వరుస ట్వీట్స్ చేశారు. దీనికి లోకేష్ కూడా అంతే ఘాటుగా రిప్లై ఇవ్వడంతో ట్విట్టర్ వార్ వేడెక్కింది. ఇక వీరి ట్వీట్లతో పాటే వైసీపీ, టీడీపీ అభిమానులు కూడా ఈ ట్వీట్లపై కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు.
విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ ‘నిరుద్యోగ యువతకు జగన్ గ్రామ వలంటీర్లు ఉద్యోగాలిస్తుంటే మీకు జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తున్నాయా బాబూ’ అంటూ చంద్రబాబును దెప్పిపొడుస్తూ ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్ లో ‘నిజాయితీగా పనిచేశామని చెప్పుకునే బాబు.. విచారణ చేయిస్తుంటే ఎందుకు కక్షసాధింపు అంటూ గగ్గోలు పెడుతున్నారు.. రాష్ట్రాన్ని చెదపురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లెవేస్తారా’ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.
దీనికి కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు కుమారుడు మాజీ మంత్రి లోకేష్.. ‘నేను విన్నాను.. ఉన్నాను అన్నారు. ఇప్పుడు సీఎం అయ్యి పాలన చేతకాక విత్తనాలు ఇవ్వడం లేదు.. పింఛన్లు అందడం లేదు.. బీమా కూడా అందడం లేదు.. చంద్రబాబు వింటాడు.. చంద్రబాబే ఉంటాడు ఇక’ అని జగన్ ను ఎండగడుతూ ట్వీట్ చేశారు. బాబుపై నిందలేస్తున్న వైసీపీ ఇప్పుడు అధికారంలో ఉండి చేయని ఎవరో తెలుసుకోవాలని లోకేష్ ట్విట్టర్ లో ప్రశ్నించారు.
ఇలా ఇద్దరి ట్వీట్ల వార్ పతాక స్థాయికి చేరింది. ఒకరి లోపాలు ఒకరు ఎత్తిచూపుకుంటూ విజయసాయిరెడ్డి, లోకేష్ బాబులు చెలరేగిపోతున్నారు. ఇప్పట్లో ఈ ట్వీట్ వార్ ఆగేలా కనిపించడం లేదు.