Begin typing your search above and press return to search.

జిల్లా కార్యాలయమే స్టేట్ ఆఫీసుగా మారింది

By:  Tupaki Desk   |   1 Oct 2015 12:26 PM IST
జిల్లా కార్యాలయమే స్టేట్ ఆఫీసుగా మారింది
X
రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ రాష్ట్రకార్యాలయాల్ని ఏపీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. ఇందులో భాగంగా ఏపీ అధికారపక్షం తన రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.

అయితే.. ఇంతకాలం ఉన్న కృష్ణా జిల్లా పార్టీ ఆఫీసును స్టేట్ ఆఫీసుగా మార్చేశారు. బెజవాడ బందర్ రోడ్డులోని లబ్బీపేటలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర ఆఫీసుగా మార్చారు. ఈ ఆఫీసును తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి లోకేష్ లు సందర్శించారు. లోకేశ్ కు ఈ కార్యాలయం నుంచే బాధ్యతలు అప్పగించొచ్చని భావిస్తున్నారు.

ఏపీకి చెందిన పార్టీ వ్యవహారాలతోపాటు.. పార్టీ కేంద్ర కార్యకలాపాల్ని కూడా బెజవాడ ఆఫీసు నుంచే నిర్వర్తించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అధినేత ఎక్కడుంటే.. అదే పార్టీ కేంద్ర స్థావరం అవుతుందన్న మాట వినిపిస్తోంది. సో.. ఇంతకాలం హైదరాబాద్ ఎన్టీఆర్ కార్యాలయంలో పలు వ్యూహాలు పన్నిన తెలుగుదేశం పార్టీ.. ఇక నుంచి బెజవాడ నుంచే తన వ్యూహాల్ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పాలి. ఇంతకాలం వెలిగిపోయిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్.. చరిత్రలో గత వైభవానికి ఒక గురుతుగా మిగులుతుందేమో.