Begin typing your search above and press return to search.

వరద ప్రాంతాల్లో లోకేష్!

By:  Tupaki Desk   |   7 Aug 2019 2:06 PM GMT
వరద ప్రాంతాల్లో లోకేష్!
X
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ నారా ట్విట్టరు వదిలి జనం బాట పట్టాడు. కొన్ని రోజులుగా దక్షిణాదిన మొత్తం భారీ వర్షాలు పడుతుండటంతో నదులు - వాగులు - చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద నీటిలో మునిగిన పంట పొలాలను నారా లోకేష్ సందర్శించారు. పెనుమంత్ర - ఆచంట - పోడూరు మండలాల్లో లోకేష్ పర్యటిస్తూ నీటిలో మునిగిన పంటపొలాలను పరిశీలించారు. పంట కోల్పోయిన రైతులతో లోకేష్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

లోకేష్ తో పాటు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు - టీడీపీ గుంటూరు నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా పర్యటనలో ఉన్నారు. వరద వల్ల పంట కోల్పోయిన వారు - ఇళ్లు - నివాసం కోల్పోయిన వారు లోకేష్ తో మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తంచేశారు. వరద వల్ల సర్వం కోల్పోయినట్లు వివరించారు.

లోకేష్ వ్యక్తిగత పర్యటనలు బాగా తక్కువగా చేస్తుంటారు. మంత్రిగా ఉన్న కాలంలో కూడా జనంతో లోకేష్ మమేమకమైన సందర్భాలు చాలా తక్కువే. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు స్వయంగా పర్యటించేవారు. అయితే, ఇటీవల లోకేష్ పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యతలు చూస్తున్నట్టు ఆయన సోషల్ మీడియాలో స్పందన బట్టి తెలుస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ అసెంబ్లీలో అడుగు పెడదాం అనుకున్న లోకేష్ ఆశలు నెరవేరకపోవడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాను మంగళగిరి నుంచే పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.