Begin typing your search above and press return to search.
సందిగ్థంలో టీడీపీ నేతలు
By: Tupaki Desk | 13 Aug 2016 8:38 AM GMT తెలుగుదేశం పార్టీ నేతలకు పెద్ద సందేహం వచ్చిపడింది. ప్రత్యేక హోదాయా... ప్రత్యేక ప్యాకేజీయా? ప్రజల ముందు ఏం చెప్పాలన్న గందరగోళంలో పడ్డారు వారు. పార్టీ పెద్దల్లో ఉన్న అయోమయమే దానికి కారణమని చెబుతున్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు హోదా కావాలని పట్టుపడుతుంటే ఆయన తనయుడు యువనేత లోకేశ్ ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతున్నారని పార్టీ నేతలు అంటున్నారు. అంతేకాదు... హోదా ఎవడిక్కావాలి అన్నట్లుగా.. హోదాతో గట్టిగా 5 వేల ఉద్యోగాలు కూడా రావని లోకేశ్ వ్యాఖ్యానించినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో నేతలంతా ఎవరినీ ఫాలో అవ్వాలో అర్థం కాక జుత్తు పీక్కుంటున్నారు. మీడియా వాళ్లు కదిపితే ఏం చెప్పాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
ప్రత్యేక హోదా అంశంలో ఎవరి మాట వినాలన్న చర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది. ఇప్పటివరకూ పార్టీ విధానం హోదా కావాలన్నట్లుగానే ఉంది. దానికోసమే కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, లేకపోతే సెంటిమెంటయిన ఈ అంశం ప్రజాగ్రహంగా మారితే పార్టీకి నష్టమన్న భావన కూడా ఉంది. బిజెపికి రాష్ట్రంలో బలం లేనందున, హోదాపై ఆ పార్టీకి వచ్చిన నష్టమేమీలేదని, కానీ హోదా సెంటిమెంటుగా మారినందున, అది ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో చాలా కష్టపడవలసి ఉంటుందన్నది తెదేపా నాయకత్వం అసలు ఆందోళన. తమ పార్టీ హోదాపై అనుసరిస్తున్న విధానాన్ని ప్రతిపక్షాలు నిశితంగా పరిశీలిస్తున్నందున, ఆ అంశంలో విపక్షాల చేతికి దొరకరాదని అనుకుంటున్నారు. అందుకే ఈ విషయంలో స్పష్టంగా ఒకే మాటపై ఉండాలని భావిస్తున్నారు. కానీ... లోకేశ్ ప్యాకేజీకి మొగ్గు చూపుతూ మాట్లాడుతున్నారని మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి.
తాజాగా హోదాపై దూకుడుగా వెళుతున్న వైసీపీ అధినేత జగన్ కు అవకాశం ఇచ్చేలా ఎటూ నిర్ణయించకుండా అయోమయం సృష్టిస్తున్నారంటూ తమ అధినాయకత్వంపై టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. హోదా తీసుకున్న రాష్ట్రాల్లో ఐదువేల ఉద్యోగాలు కూడా రాలేదని, జగన్ హోదా సెంటిమెంటును రెచ్చగొడుతున్నారని తమ పార్టీ యువనేత లోకేష్ ఇటీవల అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానించిన విషయం బయటకు పొక్కడం వల్ల జనంలోకి తప్పుడు సంకేతాలు జనంలోకి వెళ్లాయని చెబుతున్నారు.