Begin typing your search above and press return to search.

టీడీపీలో చ‌ర్చ‌: రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి లోకేష్ పోటీ

By:  Tupaki Desk   |   4 Nov 2020 5:00 PM GMT
టీడీపీలో చ‌ర్చ‌:  రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి లోకేష్ పోటీ
X
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్య‌వ‌హారం మ‌రోసారి ఆస‌క్తిగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను ఎక్క‌డ నుంచి పోటీ చేయిస్తే.. బెట‌ర్‌? అని పార్టీ అధినేత‌ చంద్ర‌బా బు ఆలోచ‌న చేస్తున్న‌ట్టు.. సీనియ‌ర్ నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ న‌డుస్తోంది. సునాయాసంగా.. గెలుపుగుర్రం ఎక్కే నియోజ‌క‌వ‌ర్గం కోసం బాబు అన్వేషిస్తున్నార‌ని వారు అంటున్నారు. ఒక‌వేళ ఇబ్బంది ఉంటుంద‌ని భావిస్తే.. రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి లోకేష్‌ను బ‌రిలోకి దింపాల‌ని కూడా బాబు భావిస్తున్నార‌ని చెబుతున్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారు.

గుంటూరులో రాజ‌ధానిని ఏర్పాటు చేయ‌డం.. రైతులంతా త‌మ వైపునే ఉన్నార‌ని అంచ‌నా వేసుకున్న నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. లోకేష్‌కు మంగ‌ళ‌గిరిని కేటాయించార‌ని అప్ప‌ట్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. అదేస‌మ‌యంలో వైసీపీ నాయ‌కుడు.. మంగ‌ళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి కూడా చెక్ పెట్టే వ్యూహంతోనే బాబు.. లోకేష్‌కు అక్క‌డ ఛాన్స్ ఇచ్చార‌ని.. ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల మాదిరిగా బాబు వ్యూహం ఫ‌లిస్తుంద‌ని అంచ‌నా వేసుకున్నారు. కానీ, దాదాపు 5 వేల పైచిలుకు ఓట్ల తేడాతో లోకేష్ విజ‌యానికి దూర‌మ‌య్యారు.

ఇక‌, ఇప్పుడు .. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి అప్పుడే.. ఆలోచిస్తున్నారా? ఇప్ప‌టి నుంచే నియోజ‌క‌వ ‌ర్గాన్ని ఖ‌రారు చేయ‌డం ఎందుకు? అనే అనుమానాలు రావ‌డం స‌హ‌జం. దీనికి కూడా కార‌ణం ఉంది. ఇప్ప‌టికే ఒక నియోజ‌క‌వ‌ర్గం ఖ‌రారు చేస్తే.. అక్క‌డి లోటు పాట్లు.. నేత‌ల‌ను స‌మీక‌రించ‌డం వంటి అంశాల‌పై లోకేష్‌కు అవ‌గాహ‌న ఉంటుంద‌ని అనుకుంటున్నార‌ట చంద్ర‌బాబు. ఈ క్ర‌మంలోనే అనంత పురం జిల్లాలో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోకేష్‌ను బ‌రిలో నిల‌పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చ‌ర్చ సాగుతోంది.

అయితే, ఇక్క‌డ ఓట‌మి ఎదురైతే.. ఎలా అనే ప్ర‌శ్న‌కు గ‌తంలో పోటీ చేసిన జిల్లా గుంటూరులో క‌మ్మ‌ల‌కు ప్రాధాన్యం ఉన్న నియోజ‌క‌వ‌ర్గం నుంచి రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా లోకేష్‌ను అసెంబ్లీలోకి పంపాల‌ని చంద్ర‌బాబు కృత నిశ్చ‌యంతో ఉన్నార‌ని.. అందుకే రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను చిన్న‌బాబు కోసం కేటాయించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు సీనియ‌ర్లే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.