Begin typing your search above and press return to search.

మా కుటుంబంలో గొడ‌వ‌లా..ప‌చ్చి అబ‌ద్ధం - నారా రోహిత్‌

By:  Tupaki Desk   |   25 March 2019 11:00 AM GMT
మా కుటుంబంలో గొడ‌వ‌లా..ప‌చ్చి అబ‌ద్ధం - నారా రోహిత్‌
X
నారా కుటుంబంలో గొడ‌వ‌ల గురించి వ‌స్తున్న వార్త‌ల‌పై టాలీవుడ్ హీరో నారా రోహిత్ తీవ్రంగా స్పందించారు. అవ‌న్నీ గాసిప్స్ అని... వాటిని న‌మ్మొద్ద‌ని, మేము చాలా హ్యాపీగా ఉన్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు త‌మ్ముడి కుమారుడు నారా రోహిత్‌. ఇటీవ‌ల ఆ కుటుంబంలో గొడ‌వలున్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ వార్త‌ల‌ను రోహిత్ కొట్టి పారేస్తూ వైఎస్ కుటుంబంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

రాజ‌కీయాల కోసం కుటుంబ స‌భ్యుల‌ను కూడా హింసించే చ‌రిత్ర మీది. ఎంపీ ప‌ద‌వి కోసం సొంత బాబాయిపై చేయిచేసుకున్న‌ది నిజం కాదా అని నారా రోహిత్ ప్ర‌శ్నించారు. అది నీచ‌మైన చ‌రిత్ర కాదా? మ‌మాకు ప‌ద‌వులు కంటే కుటుంబం మొద‌టి ప్ర‌యారిటీ. సంప‌ద కోసం - ప‌ద‌వుల కోసం కోర్టులు జైళ్ల చుట్టూ తిరిగే మీకు కుటుంబ విలువ‌లు ఎలా తెలుస్తాయి? అంటూ నారా రోహిత్ ప్ర‌శ్నించారు.

ఇంకా త‌మ కుటుంబం గురించి మాట్లాడుతూ... *రాష్ట్ర అభివృద్ధికి నారా పేరు బ్రాండ్ అంబాసిడర్‌. మా నాన్న - పెద‌నాన్న రామ‌ల‌క్ష్మ‌ణుల్లా ఉంటారు. వారి మధ్య ఏ పొర‌పొచ్చాలు లేవు. వారి మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టించ‌డానికి ప్ర‌య‌త్నం చేయొద్దు. నారా పేరు నిల‌బెట్ట‌డానికి మా పెద‌నాన్న చంద్ర‌బాబు చాలు. మానాన్న రామ్మూర్తినాయుడికి ఆరోగ్యం స‌రిగా లేదు. అందుకే ఉద్దేశ‌పూర్వ‌కంగానే మేము రాజకీయాలకు దూరంగా ఉన్నాం. మీ స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం మా కుటుంబ బంధాల‌పై బురద చల్లకండి* అని రోహిత్ అన్నారు.

మా కుటుంబం ఎప్ప‌టి నుంచో స‌మాజ‌సేవ‌లో ఉంది. 40 ఏళ్ల క్రిత‌మే మా ఆస్తులను పాఠశాలలు - పంచాయితీ భవనాలకు విరాళంగా ఇచ్చాం. మా కుటుంబాన్ని మా పెదనాన్న చంద్ర‌బాబు ఏ నాడూ నిర్లక్ష్యం చేయ‌లేదు. నిద్రాహారాలు కూడా పట్టించుకోకుండా రాష్ట్రం కోసం క‌ష్ట‌ప‌డుతూ బాగా చూసుకుంటున్న‌ట్లే... మాకు కూడా ఏ లోటూ చేయ‌లేదు అంటూ నారా రోహిత్ వివ‌రించారు.